Begin typing your search above and press return to search.

నయన్‌ తో సీక్రెట్‌ ఫొటో షేర్‌ చేయమంటే..!

By:  Tupaki Desk   |   2 July 2021 9:36 AM GMT
నయన్‌ తో సీక్రెట్‌ ఫొటో షేర్‌ చేయమంటే..!
X
సౌత్ లేడీ సూపర్‌ స్టార్‌ నయనతార ప్రస్తుతం భారీ చిత్రాలను చేస్తూ వస్తోంది. పెద్ద సినిమాలకు కేరాఫ్‌ అడ్రస్‌ గా నిలిచిన నయనతార గత కొంత కాలంగా తమిళ యువ దర్శకుడు విఘ్నేష్‌ శివన్ తో ప్రేమలో ఉన్న విషయం తెల్సిందే. వీరిద్దరి ప్రేమ విషయం బహిరంగ రహస్యం. ఇప్పటి వరకు ఇద్దరు కూడా తాము ప్రేమలో ఉన్నామనే విషయాన్ని అధికారికంగా బయటకు చెప్పకున్నా కూడా కలిసి చెట్టా పట్టాలేసుకుని తిరుగుతూ లైఫ్‌ ను ఎంజాయ్‌ చేస్తున్నారు. చెన్నైలో వీరిద్దరు ప్రస్తుతం సహ జీవనం సాగిస్తున్నారనే వార్తలు కూడా వస్తున్నాయి. నయన్‌ విఘ్నేష్‌ శివన్ లు క్రమం తప్పకుండా హాలీడేస్ కు విదేశాలకు వెళ్లి వస్తూ ఉన్నారు. ఇక వీరి పెళ్లి గురించి గత రెండు మూడు సంవత్సరాలుగా అదుగో ఇదుగో అంటూ మీడియాలో వార్తలు వస్తూనే ఉన్నాయి.

ఈ లాక్ డౌన్‌ టైమ్‌ లో వీరు పెళ్లి చేసుకోబోతున్నట్లుగా పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. తిరుపతిలో వీరి పెళ్లికి ఏర్పాట్లు జరిగాయనే ప్రచారం కూడా జరిగింది. ఇక ఇద్దరు పెళ్లి కోసం ప్రత్యేక పూజలు చేసిన సందర్బాలు కూడా ఉన్నాయి. కాని తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం వీరు ఇద్దరు పెళ్లి పీఠలు ఎక్కేది కరోనా పూర్తిగా సర్దుమనిగిన తర్వాతేనట. ఎప్పుడైతే కరోనా పూర్తిగా తగ్గి పరిస్థితులు సాదారణ స్థితికి వస్తాయో అప్పుడు పెళ్లి చేసుకుంటారని.. ఖచ్చితంగా ఇండస్ట్రీ ప్రముఖులతో పాటు సన్నిహితులను అభిమానులను కూడా పెధ్ద ఎత్తున పెళ్లికి ఆహ్వానించాలని భావిస్తున్నారట.

రెగ్యులర్ గా సోషల్‌ మీడియాలో అభిమానులతో టచ్ లో ఉండే విఘ్నేష్‌ శివన్‌ అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇస్తూ ఉంటాడు. ఆ సమయంలో ఆయన నయనతార గురించిన విషయాలను గురించి కూడా చెప్పడం మనం చూశాం. కాని తాజాగా ఒక అభిమాని విఘ్నేష్‌ లైవ్‌ చాట్‌ సందర్బంగా నయన్ మేడంతో మీ పర్సనల్‌ ఫొటో ఒకటి షేర్‌ చేయండి అంటూ కోరాడు. అతడి కోరిక మేరకు నయన తార తో ఆయన తీసుకున్న ఫొటో ను షేర్‌ చేశాడు. మిర్రర్‌ ముందు ఇద్దరు నిల్చుని తీసుకున్న ఆ ఫొటో చాలా సింపుల్‌ గా క్యూట్‌ గా ఉందంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం వీరిద్దరి కాంబోలో వరుసగా సినిమా లు వస్తున్నాయి.

నయన్‌ హీరోయిన్ గా విఘ్నేష్ నిర్మాణంలో సినిమా లు రూపొందుతున్నాయి. అదే సమయంలో ఆయన దర్శకత్వం లో కూడా నయన్‌ నటిస్తూ ఉంది. వీరిద్దరి కాంబోలో ఒక సినిమా రూపొందుతోంది. ఆ సినిమా లో సమంత మరియు విజయ్‌ సేతుపతిలు కీలక పాత్రలో కనిపించబోతున్నారు. పెళ్లి కాకుండానే కలిసి జీవితాన్ని సాగిస్తున్న వీరిద్దరు ముందు ముందు కూడా ఇలాగే సంతోషంగా గడపాలంటూ అభిమానులు కోరుకుంటున్నారు. నయన్‌ గత లవ్‌ ఫెల్యూర్స్ నేపథ్యం లో మొదట్లో విఘ్నేష్‌ శివన్‌ తో ప్రేమ విషయంలో కొందరు అనుమానాలు వ్యక్తం చేశారు. కాని ఇప్పుడు మాత్రం ఇద్దరి అన్యోన్యత చూసి ఇద్దరు కలకాలం ఇలాగే సంతోషంగా ఉంటారనే నమ్మకంను వ్యక్తం చేస్తున్నారు.