Begin typing your search above and press return to search.

సింగర్‌ కనికపై సెక్షన్‌ 269 కేసు నమోదు

By:  Tupaki Desk   |   21 March 2020 4:02 AM GMT
సింగర్‌ కనికపై సెక్షన్‌ 269 కేసు నమోదు
X
ప్రస్తుతం ప్రపంచంలో కరోనా ఏ స్థాయిలో ఉజృంభిస్తుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇలాంటి సమయంలో ప్రతి ఒక్కరు కూడా చాలా జాగ్రత్త గా ఉండాలంటూ ప్రభుత్వాలు పదే పదే హెచ్చరిస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా విదేశాల నుండి వచ్చిన వారు స్వీయ నిర్భందంలో ఉండటంతో పాటు వారి ఆరోగ్యంపై ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని కేంద్రం తెలియజేస్తూనే ఉంది. కాని బాలీవుడ్‌ సింగర్‌ కనిక కపూర్‌ మాత్రం చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించింది.

లండన్‌ నుండి ఇటీవలే వచ్చిన ఆమె కరోనా ముందస్తు పరీక్షలు చేయించుకోలేదు. పైగా ఆమె విదేశాల నుండి వచ్చిన వెంటనే పార్టీలు అంటూ చాలా మందిని కలిసింది. దాంతో ఇప్పుడు ఆమె వల్ల చాలా మందికి కరోనా వ్యాపించే అవకాశం ఉంది. ఇప్పటికే కనిక కరోనా పాజిటివ్‌ అని తేలడంతో ఆమెతో కలిసిన వారి వివరాలను సేకరిస్తున్నారు. ఈ సమయంలోనే కనికపై కేసు కూడా నమోదు అయ్యింది.

ఉత్తర ప్రదేశ్‌ పోలీసులు ఆమెపై చట్టపరమైన చర్యలకు సిద్దం అవుతున్నారు. నిర్లక్ష్య పూరితంగా ప్రాణాంతక మైన వైరస్‌ ను విస్తరింపజేసినందుకు గాను కనిక పై సెక్షన్‌ 269 కింద కేసు నమోదు చేయడం జరిగింది. మరెవ్వరు ఇలా అశ్రద్దగా వ్యవహరించకూడదనే ఉద్దేశ్యంతో కనిక పై కఠిన చర్యలు తీసుకోవాల్సిందే అంటూ అంతా కోరుతున్నారు. ఆమె విమానాశ్రయంలో స్క్రీ నింగ్‌ కు కూడా సహకరించలేదని ప్రచారం జరుగుతోంది. అందుకు సంబంధించి కూడా కేసు నమోదు అయ్యే అవకాశం ఉంది.