Begin typing your search above and press return to search.

మీడియా పై సెక్యూరిటీ గార్డ్స్ దాడి..!

By:  Tupaki Desk   |   17 Sept 2022 3:38 PM IST
మీడియా పై సెక్యూరిటీ గార్డ్స్ దాడి..!
X
మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా నటించిన లేటెస్ట్ హిందీ మూవీ ''బబ్లీ బౌన్సర్''. మధుర్ బండార్కర్ తెరకెక్కించిన ఈ సినిమా రిలీజ్ కు రెడీ అయింది. ఈ నేపథ్యంలో మూవీని ప్రమోట్ చేయడానికి ఈ రోజు హైదరాబాద్‌ లోని అన్నపూర్ణ స్టూడియోలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు.

'బబ్లీ బౌన్సర్' కార్యక్రమానికి చిత్ర యూనిట్ తెలుగు మీడియాను ఆహ్వానించింది. అయితే ప్రెస్ మీట్ కోసం అక్కడికి వచ్చిన మీడియా వారిపై సెక్యూరిటీ గార్డ్స్ దురుసుగా ప్రవర్తించారు. అసభ్యకరమైన పదజాలంలో దూసిస్తూ భౌతిక దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది.

ప్రెస్ మీట్ ముగిశాక మీడియా ప్రతినిధులు తమన్నా ఇంటర్వ్యూ కోసం ప్రయత్నించారు. దానికి అనుమతి లేదంటూ అక్కడున్న సెక్యూరిటీ గార్డ్స్ దూషించడం ప్రారంభించారు. దీనిపై ఓ మీడియా ఫోటోగ్రాఫర్‌ ప్రశ్నించగా..సెక్యూరిటీ సిబ్బంది అతనిపై భౌతికంగా దాడి చేశారు.

స్టూడియోలో సెక్యూరిటీ గార్డ్స్ ఓవర్ యాక్షన్ కు సంబంధించిన వీడియో క్లిప్పింగ్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. అందులో బౌన్సర్ ఒకరు డస్ట్ బిన్ ని ఎత్తి దాడి చేస్తామని బెదిరించడం కనిపిస్తుంది. ఈ ఘటనలో ఇద్దరికి స్వల్పంగా గాయాలయ్యాయని తెలుస్తోంది.

సెక్యూరిటీ గార్డ్స్ వికృత ప్రవర్తనపై తెలుగు మీడియా నిరసనలు చేయడంతో.. ఇది తీవ్ర ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది. ఈ క్రమంలో సంబంధిత వ్యక్తులపై పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు మీడియా మిత్రులు సిద్ధమయ్యారు. అయితే చివరకు నిర్వాహకులు తప్పు చేసిన సెక్యూరిటీ గార్డ్స్ తో ప్రెస్ ఫోటోగ్రాఫర్‌ లకు క్షమాపణలు చెప్పడంతో సమస్య సర్దుమణిగింది.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.