Begin typing your search above and press return to search.
రెడ్ లైట్ ఏరియాకు వెళ్లొచ్చాను : శ్వేతాబసు
By: Tupaki Desk | 5 Feb 2021 12:00 PM GMT‘కొత్తబంగారు లోకం’ సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది శ్వేతా బసు ప్రసాద్. ఈ సినిమా సంచలన విజయం సాధించింది. అయితే.. ఆ తర్వాత నటించిన సినిమాలు పెద్దగా ఆడలేదు. ఈ క్రమంలోనే శ్వేతా సెక్స్ రాకెట్లో చిక్కుకోవడంతో కెరీర్ ఇబ్బందులపాలైంది. చాలా కాలం కొనసాగిన ఈ కేసులో శ్వేతా నిర్దోషిగా బయటపడింది.
ఆ తర్వాత 2018 డిసెంబర్ 13న ఆమె వివాహం చేసుకుంది. బాలీవుడ్ దర్శకుడు రోహిత్ మిట్టల్‌ను శ్వేతా ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. కానీ.. సంవత్సరంలోగానే వారిద్దరూ విడాకులు తీసుకున్నారు. తాజాగా.. ఈ విషయంపై స్పందించింది శ్వేత. తామిద్దరం పరస్పర అంగీకారంతోనే విడిపోయామని అన్నారు. అంతేకాదు.. దానికి విడాకులు అని పేరు పెట్టాల్సిన పనిలేదని, ఒక బ్రేకప్‌లా జరిగిందని చెప్పారు శ్వేతాబసు.
ప్రస్తుతం బాలీవుడ్ లో ‘ఇండియా లాక్‌డౌన్’ అనే సినిమాలో నటిస్తోంది శ్వేతాబసు. లాక్‌డౌన్‌లో ఏయే రంగాల ప్రజలు.. ఎలాంటి ఇబ్బందులు పడ్డారనే పాయింట్ తో మధుర్ బండార్కర్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో సెక్స్ వర్కర్ ‘మెహ్రునిస్సా’గా కనిపించనుంది శ్వేత.
లాక్‌డౌన్ వల్ల అన్ని రంగాలూ దెబ్బతిన్న విషయం తెలిసిందే. ముంబైలోని రెడ్‌లైట్ ప్రాంతంలో నివసించే సెక్స్ వర్కర్లు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అయితే.. వారు ఎలాంటి సమస్యలను ఎదుర్కొన్నారో స్వయంగా తెలుసుకోవాలనుకున్న చిత్ర యూనిట్ ముంబై రెడ్‌లైట్ ఏరియాలోని కామాటిపురను సందర్శించింది.
ఈ విషయం గురించి శ్వేత మాట్లాడుతూ.. ‘‘నేను చేసే పాత్రలు నిజమని నమ్ముతాను, వాటిల్లో లీనమైపోతాను. లేదంటే ప్రేక్షకులు ఆ పాత్రను ఓన్ చేసుకోలేరు. నా పాత్ర ఇంకా మెరుగ్గా వచ్చేందుకు మధుర్ సర్, నేను, నా టీమ్ మొత్తం రెండు వారాల క్రితం కామాటిపుర వెళ్లాం. అక్కడ వారి యాసను బట్టి నేను సినిమాలో ఎలా మాట్లాడాలో తెలుసుకున్నాను. వాళ్ల ఆలోచనా విధానం ఎలా ఉంది? వారి జీవితాలు ఎలా ఉన్నాయి? అనే విషయాలు కూడా తెలుసుకున్నా.’’ అని చెప్పింది శ్వేతా.
ఇంకా మాట్లాడుతూ... ‘‘లాక్‌డౌన్ వాళ్ల వ్యాపారం మీదనే కాదు.. వారి జీవితాల మీద కూడా కోలుకోలేని దెబ్బ కొట్టింది. అక్కడకు వెళ్లిచూస్తే చాలా విషయాలు అర్థమయ్యాయి. నేను అక్కడకు వెళ్లడం లైఫ్‌టైమ్ ఎక్స్‌పీరియన్స్‌గా భావిస్తున్నాను. ముఖ్య విషయం ఏమంటే.. నేను అక్కడ మెహ్రునిస్సాను కలిశాను. అచ్చంగా నేను చేయబోయే పాత్రే కళ్లముందు కనిపించినట్టుంది. సినిమాలోని నా పాత్రను ఆమెకు అంకితం చేస్తున్నాను’’ అని చెప్పుకొచ్చింది శ్వేతా బసు.
కాగా.. బాలీవుడ్‌లో సెక్స్ వర్కర్ల సమస్యల మీద ఇప్పటివరకు చాలా సినిమాలు వచ్చాయి. పలువురు నటీమణులు వేశ్య పాత్రలను పోషించారు. మండీ(1983)లో శబానా అజ్మీ, స్మిత పాటిల్, చాందినీ బార్(2001)లో టబు, చమేలీ(2003)లో కరీనా కపూర్, ట్రాఫిక్ సిగ్నల్(2007)లో కొంకణ సేన్‌శర్మ సెక్స్ వర్కర్లుగా నటించారు. రాబోతున్న శ్వేత బసు చిత్రం ఎలా ఉంటుందో చూడాలి.