Begin typing your search above and press return to search.
సామ్ కర్ర ఫైట్ చితకేస్తుంది కానీ!
By: Tupaki Desk | 5 Feb 2019 1:30 AM GMTసమంత నటించిన మజిలీ రిలీజ్ కి ఇంకా చాలానే సమయం ఉంది. ఈలోగానే తను నటించిన అనువాద చిత్రం సీమరాజా తెలుగులో రిలీజ్ కి రెడీ అవుతోంది. 2018 సెప్టెంబర్ లో ఈ చిత్రం రిలీజై కోలీవుడ్ లో యావరేజ్ గా ఆడింది. అయితే ఈ చిత్రాన్ని ఇప్పుడు తెలుగులో అనువదించి రిలీజ్ చేస్తున్నారు. శివకార్తికేయన్ - కీర్తి సురేష్ - సమంత ప్రధాన తారాగణం. ఈ చిత్రం డబ్బింగ్ పనులు పూర్తి చేసుకుని క్లీన్ యు సర్టిఫికెట్ తో ఫిబ్రవరి 8న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో నిర్మాత మాట్లాడుతూ .. ఈ చిత్రంలో సామ్ పెర్ఫామెన్స్ షేక్ చేస్తుందని అన్నారు.
ఈ చిత్రంలో సమంత కర్రఫైట్ గుబులు రేపుతుందని ఆయన చెప్పారు. ఇక ఈ సినిమా తమిళ వెర్షన్ విషయంలో తంబీ క్రిటిక్స్ మాత్రం పెదవి విరిచేశారు. ఇందులో ఊర మాస్ కామెడీ ఏమంత ఆకట్టుకోదని - కథాంశాన్ని దర్శకుడు తప్పు దారి పట్టించాడని నెగెటివ్ రివ్యూలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ అయితే 1.5 రేటింగ్ ఇచ్చింది. బాహుబలి తరహా సెట్స్ వేసి అల్లా ఉద్దీన్ ఖిల్జీ పాత్రధారిని ఇందులో చూపించి వెగటు పుట్టించారని రివ్యూల్లో తెలిపారు. ఇక సమంత కర్ర ఫైట్ - నటన మాత్రమే సినిమాకి అస్సెట్ అన్న సమీక్షలు వచ్చాయి.
ఇక ఈ సినిమాని తక్కువ ఖరీదుకు కొనుక్కుని నిర్మాతలు తెలుగులో రిలీజ్ చేస్తున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇక ఈ చిత్రం కొనడానికి ప్రధాన కారణం నిర్మాత చెప్పారు. తన ఫ్రెండ్ ఒకరు ఈ సినిమాలోని ఒక డైలాగ్ పంపించారు. ఆ డైలాగ్ స్ఫూర్తినిచ్చిందిట. మనిషి బ్రతకడానికి మిత్రుడు ఎంత ముఖ్యమో శత్రువు కూడా అంతే ముఖ్యం అన్న డైలాగ్ చాలా నచ్చింది. ఆ డైలాగ్ నాలో తెలియని ఒక ఫీలింగ్ ని తెచ్చి రిలీజ్ చేస్తున్నారట. ఇక తెలుగు రాష్ట్రాల్లో 400 థియేటర్లలో ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నామని - దండుపాళ్యం 3 - కురుక్షేత్రం - మారి 2 చిత్రాల తర్వాత సీమరాజా తమ బ్యానర్ నుంచి వస్తోందని తెలిపారు. నిర్మాత కథ గురించి చెబుతూ.. ఈ కథలోకి వస్తే అల్లరి చిల్లరిగా తిరిగే రాజు కుటుంబీకుడు హీరో. రాజు మొత్తం జాగ్రత్తగానే పని చేసుకుంటూ వెళతారు. శివకార్తికేయన్ బాహుబలి రేంజ్ లో ఫైట్ లు చేశారు. గుర్రాలు - కత్తులు అన్నీ ఉంటాయి. కాని నేను ఇక్కడ అవన్నీ తీసేశాను. కేవలం రెండు గంటలు మాత్రమే ఉంటుంది ఈ చిత్రం. అసలు రాజు అనే వాడు ఎలా ఉంటాడు ఏంటి అన్నది ఫ్లాష్ బ్యాక్ మైమరిపిస్తుంది ... సిమ్రన్ విలన్ లాల్ మళయాళం యాక్టర్ బాగా చేశారని తెలిపారు. అయితే మూడు గంటల సినిమాని ఏకంగా గంట కోసేయడం అంటే మన ఆడియెన్ కి మరి ఏం చూపిస్తున్నారో?