Begin typing your search above and press return to search.

భర్తతో స్టార్‌ హీరోయిన్‌ ఓపెన్‌ రొమాన్స్‌!

By:  Tupaki Desk   |   7 July 2019 10:43 AM GMT
భర్తతో స్టార్‌ హీరోయిన్‌ ఓపెన్‌ రొమాన్స్‌!
X
బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ ప్రియాంక చోప్రా కొన్ని నెలల క్రితం ప్రియుడు నిక్‌ జోనస్‌ ను వివాహం చేసుకున్న విషయం తెల్సిందే. వీరిద్దరు పెళ్లికి ముందు ఎంత జోవియల్‌ గా తిరిగారో.. వీరిద్దరు అప్పుడు ఎంతగా ఎంజాయ్‌ చేశారో పెళ్లి తర్వాత అంతకు మించి ప్రేమ పక్షుల మాదిరిగా విహరిస్తున్నారు. సందు దొరికితే చాలు.. సమయం చిక్కితే చాలు ప్రేమలో మునిగి పోతున్న ఈ జంట తాజాగా పబ్లిక్‌ గా ఓపెన్‌ ప్లేస్‌ లో ప్రేమలో మునిగి పోయి రొమాన్స్‌ చేసుకోవడం జరిగింది. ఆ వీడియో కాస్త సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది.

ఇటీవలే నిక్‌ సోదరుడి వివాహం కోసం విదేశాలకు వెళ్లిన నిక్‌ మరియు పీసీలు ఆ పెళ్లిని ముగించుకుని ఇటలీ వెళ్లారు. అక్కడ టస్కనీ ప్రదేశంలో ఎంజాయ్‌ చేస్తున్నారు. అత్యంత సుందరంగా ఉండే టస్కనీ రొమాంటిక్‌ పీల్‌ కలిగిస్తుందని అంటారు. అలాంటి ప్రదేశంలో ఈ జంట తెగ ఎంజాయ్‌ చేస్తున్నారు. రాత్రి పగలు అనే తేడా లేకుండా వీరిద్దరు తెగ ఎంజాయ్‌ లో మునిగి పోతున్నారు.

టస్కనీలోని భార్య ప్రియాంక చోప్రాతో చేసిన రొమాన్స్‌ ను స్వయంగా నిక్‌ తన సోషల్‌ మీడియా పేజీలో షేర్‌ చేశాడు. వీరిద్దరి అన్యోన్యం చూస్తూంటే చాలా ముచ్చటేస్తోందని కామెంట్స్‌ వస్తున్నాయి. మీ ప్రేమను చూస్తుంటే మరోసారి ప్రేమకు ఏదీ అడ్డు కాదని మీరు నిరూపించారంటూ చాలా మంది కామెంట్స్‌ చేశారు.

ఇక పెళ్లి తర్వాత లైఫ్‌ చాలా మారుతుందని అంతా అన్నారు. కాని నా లైఫ్‌ మాత్రం గతంలో మాదిరిగానే చాలా సరదాగా లవ్‌ లో ఉందని ప్రియాంక చోప్రా తాజాగా ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. నిక్‌ ను చూస్తుంటే నాకు భర్తకు భాయ్‌ ఫ్రెండ్‌ కు తేడా లేదు అనిపిస్తుంది. భర్త అయినా కూడా నాకు నిక్‌ బాయ్‌ ఫ్రెండ్‌ మాదిరిగానే ఉంటున్నాం. పెళ్లి తర్వాత జీవితంలో మరింత సేఫ్టీ దొరికినట్లుగా అనిపిస్తుందని ఆమె చెప్పుకొచ్చింది.