Begin typing your search above and press return to search.

ఇంటర్యూ: అట్టాంటి ఇట్టాంటి ల‌వ్‌ స్టోరీ కాదు

By:  Tupaki Desk   |   20 Oct 2015 4:58 AM GMT
ఇంటర్యూ: అట్టాంటి ఇట్టాంటి ల‌వ్‌ స్టోరీ కాదు
X
‘రన్ రాజా రన్’ చిత్రంతో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ కొట్టింది రింగుల‌జుత్తు సుంద‌రి సీరత్ కపూర్. తొలిప్ర‌య‌త్న‌మే అసాధార‌ణ‌ విజ‌యం అందుకున్న ఈ భామ‌ ‘టైగర్’ సినిమాతో రెండో హిట్ ద‌క్కించుకుంది. లేటెస్టుగా ‘కొలంబస్’ తో తెలుగు ప్రేక్షకుల ముందుకు వ‌స్తోంది. కొలంబస్ అక్టోబర్ 22న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా సీరత్ కపూర్ సినిమా సంగ‌తులు చెప్పుకొచ్చిందిలా... పాయింట్ల వారీగా మీకోసం...

--నీరు అలియాస్ నీరజ .. చాలా జోవియల్ గా ఉండే అమ్మాయి. తను మ‌న‌సులో ఏం అనుకుంటే అది ఉన్నది ఉన్నట్టుగా చెప్పే అమ్మాయి. అలాగే ఫ్యామిలీకి, కుటుంబ విలువలకి గౌరవం ఇచ్చే అమ్మాయి. తన లవ్ లోని ప్రాబ్లమ్స్ ని కూడా అర్థం చేసుకొనే అమ్మాయి. భావోద్వేగాలు ప‌లికించే పాత్ర ఇది.

--ఈ చిత్రంలో న‌టించిన నా కోస్టార్‌ సుమంత్ అశ్విన్ వెరీ టాలెంటెడ్ యాక్టర్. చాలా సపోర్ట్ ఇస్తాడు, అందరితో బాగా కలిసిపోతాడు. ఈ సినిమా టైంలో నేను తెలుసుకుంది ఏమిటి అంటే సుమంత్ అశ్విన్ చాలా ఫోకస్ ఉన్న హీరో. కచ్చితంగా పెద్ద హీరో అవుతాడు.

--మిస్తీ గొప్ప హ్యూమన్ బీయింగ్. ఇద్దరం చాలా సౌఖ్యంగా వర్క్ చేసాం. నా కెరీర్ ఆరంభ‌మే ఇండస్ట్రీలో ఒకే సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ ఉంటే వారి మధ్య రిలేష‌న్ బావుండ‌దు.. అని అనేవారు. కానీ ఒకరి స్కిల్స్ గురించి ఒకరికి కచ్చితంగా తెలిస్తే ఎలాంటి ఇబ్బంది ఉండదు. మేము ఇద్దరం అలా ఆలోచించే వాళ్ళం కాబట్టి ఎలాంటిఇబ్బంది లేకుండా సినిమా చేసాం.

--నాకు తెలుగు రాదు. లిప్ కదిలించేయడం, 1 , 2 , 3లు చెప్పడం రాదు. తొలి నుంచీ ప్రతి సీన్ ని అర్థం చేసుకొని ఆ తెలుగు డైలాగ్స్ కి మీనింగ్ తెలుసుకొని, వాటిని బాగా నేర్చుకొని చెప్పేదాన్ని. తొలిసినిమా టైమ్‌ లో కొత్త కాబట్టి కాస్త ఇబ్బంది పడ్డాను, కానీ ఇప్పుడు తెలుగు బాగా అర్థమవుతోంది కాబట్టి ఇబ్బంది లేదు.

-- ప్రారంభం కథకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాను. కథ నచ్చి ఇది వర్కౌట్ అవుతుంది అంటేనే చేస్తాను. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేయడం వలన క్వాలిటీ మిస్ అవుతుందని నేను ఫీలవుతాను. ఒక మంచి కథతో, ఒక గుడ్ ప్రొడక్షన్ హౌస్ లో సినిమా చేయడానికి ఇష్టపడతాను. ఎంపిక‌ల్లో సెల‌క్టివ్ గా ఉంటాను.

--ద‌ర్శ‌కుడు చ‌క్క‌ని ద‌ర్శ‌కుడే కాదు మంచి రైట‌ర్ కూడా. స్క్రిప్ట్ మాత్రమే కాకుండా తను రాసుకున్న సీన్స్, డైలాగ్స్ యూత్‌కి గిలిగింత‌లు పెట్టేలా ఉంటాయి. ఇప్పటి యువత రోజూ మాట్లాడుకునేలా ఉంటాయి. చాలా కామ్ గా ఉంటూ యాక్టర్స్ నుంచి తనకి కావాల్సింది రాబట్టుకుంటాడు. అదే అతనికి ప్ల‌స్‌.

--నాకు మొదటి నుంచి ఇండస్ట్రీ నుంచి మంచి సపోర్ట్ ఉంది. ప్రారంభ‌ సినిమా విషయంలో వంశీ చాలా కేర్ తీసుకున్నారు, అలాగే సెకండ్ సినిమా టైంలో మధు సాయ‌ప‌డ్డారు.

--హిందీలో మంచి కథ కోసం ఎదురు చూస్తున్నాను. నేను ముంబైలో ఉన్నా ఎక్కువగా స్టొరీ సిటింగ్స్ కోసం ఇక్కడికి వస్తుంటాను. తెలుగులో కొన్ని కథలు వింటున్నాను, కానీ ఇంకా ఏదీ ఫైనలైజ్ కాలేదు. త‌ర్వాతి సినిమా వివ‌రాలు త్వ‌ర‌లోనే చెబుతాను.