Begin typing your search above and press return to search.

టాప్ లెస్ ఐడియా బాగా కలిసొచ్చిందట

By:  Tupaki Desk   |   2 May 2017 9:04 AM GMT
టాప్ లెస్ ఐడియా బాగా కలిసొచ్చిందట
X
పక్కింటి అమ్మాయిలా కనిపించే లుక్ తో.. టాలీవుడ్ లో అడుగుపెట్టిన రన్ రాజా రన్ హీరోయిన్ సీరత్ కపూర్.. ఆ ఇమేజ్ తో లాభం లేదంటోంది. అందుకే పద్ధతి మార్చేసి తన అందాలతో కనువిందు చేసే పని మొదలెట్టింది. చూసే వాళ్ల మైండ్ బ్లాక్ అయ్యేవిధంగా తన సోషల్ నెట్ వర్క్ సైట్ లో కొత్త ఫొటోలను పెట్టింది.

తను ఫేమస్ అయిన రింగుల జుట్టుతో కాకుండా లూజ్ హెయిర్ తో మత్తెక్కించే లుక్ తో టాప్ లెస్ గా ఇచ్చిన ఫోజు సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ అయిపోయింది. ఇదేంటి.. ఒక్కసారి ఇంత మార్పు అని సీరత్ ను అడిగితే ఇది ఇప్పటికిప్పుడు వచ్చిన మార్పు కాదంటోంది. ఎప్పటి నుంచో తన మైండ్ లో ఉన్న ఆలోచనే అంటోంది. "ఒకే తరహా నటనకు పరిమితం అయిపోదలచుకోలేదు. నేను చేయగలిగింది చాలానే ఉంది. నటిగా నన్ను నేను నిరూపించుకోవడమే కాదు. నాలో ఉన్న కొత్త యాంగిల్ చూపించాలని అనుకుంటున్నా. ఆసక్తికరమైన పాత్రలతో ప్రేక్షకులను మెప్పించాలనుకుంటున్నా" అంటోందీ భామ. అందుకే తన స్టైలిస్ట్ ఇచ్చిన ఐడియాకు ఓకే చెప్పేసి టాప్ లెస్ ఫొటోకు ఫోజులిచ్చానంటోంది.

ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. సీరత్ ఐడియా బాగానే వర్కవటుయింది. ఆమె హాట్ అందాలు ఫొటో వైరల్ అయిన వెంటనే అవకాశాలు ఆమె తలుపుతట్టాయి. మూడు సినిమాలు ఇప్పడు తన చేతిలో ఉన్నాయి. తన కొత్త లుక్ బాగుందని సినీ జనాలంతా మెచ్చుకుంటున్నారు. టాలీవుడ్ మన్మథుడు నాగార్జున కూడా ఈ కొత్త లుక్ బాగుందని కితాబిచ్చారంటూ ఆనందంగా చెబుతోంది సీరత్ కపూర్.



Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/