Begin typing your search above and press return to search.
కుర్రాడికి, కళావతిలకే ఓటు పడింది
By: Tupaki Desk | 29 Jan 2016 9:30 AM GMTసంక్రాంతికి నాలుగు సినిమాల రిలీజ్ అయ్యి, అన్నీ పాజిటివ్ టాక్ తెచ్చుకున్నాక, థియేటర్ల కొరతతో ఒక్క మూవీ కూడా రిలీజ్ కాలేదు. రెండు వారాల గ్యాప్ తర్వాత ఇవళా మళ్లీ థియేటర్లు కొత్త సినిమాలతో కళకళలాడుతున్నాయి. కొత్త బొమ్మలు కనిపిస్తుండడంతో.. జనాలు కూడా థియేటర్ల వైపు బాగానే వస్తున్నారు.
సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలు మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు హ్యాట్రిక్ హీరో రాజ్ తరుణ్. అలాగే చంద్రకళకి సెకండ్ పార్ట్ అంటూ వచ్చేసింది డబ్బింగ్ సినిమా కళావతి. ఈ రెండు సినిమాలకు ఓపెనింగ్స్ సూపర్ట్ గా ఉన్నాయని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. ఈ ఓపెనింగ్స్ కి మంచి టాక్ కూడా తోడైతే.. ఇవి రెండూ సూపర్ హిట్ రేంజ్ కి చేరుకునే అవకాశాలున్నాయంటున్నారు. మరోవైపు లచ్చిందేవికి ఓ లెక్కుంది అంటూ అందాలరాక్షసి జంట నవీన్ చంద్ర, లావణ్య త్రిపాఠిలు మరోసారి కలిసి నటించి ప్రేక్షకుల ముందుకు వచ్చారు.
రాజమౌళి శిష్యుడు జగదీష్ రూపొందించిన ఈ మూవీపై అంచనాలు ఉన్నా.. అవేవీ ఓపెనింగ్ కు సహాయపడలేదు. టాక్ బాగుంటే తప్ప - కలెక్షన్స్ పెరగవని అంటున్నారు. ఇక నేనూ రౌడీనే అంటూ నయనతార కోలీవుడ్ మూవీ నానుం రౌడీదాన్ ని తెచ్చినా.. దీన్ని తెలుగు ప్రేక్షకులు అంతగా పట్టించుకోవడం లేదని అంటున్నారు. తమిళ్ నేటివిటీ ఎక్కువగా ఉండడం ఈ చిత్రానికి మైనస్ గా చెప్పుకుంటున్నారు