Begin typing your search above and press return to search.
మీమ్స్ పై సీతమ్మ రాక్.. ఒక్కొక్కరికి ప్యాక్!
By: Tupaki Desk | 12 Feb 2022 5:07 AM GMTబాలీవుడ్ హీరోయిన్ అలియాభట్ `ఆర్ ఆర్ ఆర్` సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తోన్న సంగతి తెలిసిందే. ఇందులో అలియా భట్ రామ్ చరణ్ కి జోడీగా సీత పాత్రలో నటిస్తుంది. ఆరంభంలోనూ బ్యూటీ అరుదైన పాత్రని అందిపుచ్చుకుంది. అదీ తెలుగు ప్రేక్షకులకు వేగంగా కనెక్ట్ అయ్యే రోల్ కావడం అలియా కెరీర్ కి కలిసొచ్చే అంశం. అందుకే ఈ బ్యూటీ ని యంగ్ టైగర్ ఎన్టీఆర్ సైతం ముందుగానే లాక్ చేసారు.
ఆయన కథానాయకుడిగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న చిత్రంలో అలియానే హీరోయిన్ గా ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది. ఈ రెండు చిత్రాల్ని బట్టే అలియా తెలుగులో గనుక కొనసాగితే ఇక్కడా స్టార్ హీరోయిన్ గా అవతరించడానికి ఎంతో సమయం పట్టదు.
తాజాగా ఈ బ్యూటీ మీమ్స్ పై తనదైన శైలిలో కౌంటర్ వేసింది. `నాపై చేసిన మీమ్స్ తో నాకెలాంటి సమస్యలు లేవు. అవి నాకు చాలా ఫన్నీగా అనిపిస్తాయి. మీమ్ లు చేసిన వారి పాపులారిటీని పెంచుతాయని`` తనదైన శైలిలో క్లాస్ గా కౌంటర్ ఇచ్చింది. ఇదే విషయాన్ని గతంలో మీమ్స్ చేసిన వారికి చెప్పాను. మళ్లీ చెబుతున్నా..నన్ను పాపులర్ చేయాలనుకుంటే నాకు బధులుగా మీరు అవుతారని అలియా పంచ్ వేసింది.
ఇక బాలీవుడ్ అలియాలో ఎంత బిజీగా ఉందో తెలిసిందే. ప్రస్తుతం ఆమె నటిస్తోన్న `గంగూబాయి కతియావాడి` పై భారీ అంచనాలున్నాయి. ఇటీవలే రిలీజ్ అయిన ట్రైలర్ సినిమాపై అంచనాల్ని అంతకంతకు పెంచేసింది.
అలియా నట విశ్వరూపం గంగూబాయి పాత్రలో ఆవిష్కరించినట్లే కనిపిస్తోంది. ఆ పాత్ర ఆహార్యంలో అలియా ఒదిగిపోయింది. సినిమా సక్సెస్ అయితే గనుక అలియాభట్ కి ప్రత్యేకమైన ఇమేజ్ ని ..గుర్తింపుని తీసుకొస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఫిబ్రవరి 25న చిత్రాన్ని నేరుగా థియేటర్లలోనే రిలీజ్ చేస్తున్నారు. దీంతో యూనిట్ ప్రచార కార్యక్రమాల్లో నిమగ్నమైంది.
అలియా భట్ బాలీవుడ్ మీడియాకి ప్రత్యేక ఇంటర్వ్యూలు ఇస్తూ బిజీగా ఉంది. బాలీవుడ్ టెలివిజన్ షోస్ కి హాజరవుతూ గంగూబాయి కి వీలైనంత ప్రచారం కల్పిస్తోంది. ఈ ఏడాది అలియా భట్ తొలి సినిమా రిలీజ్ ఇదే. మార్చి 25న `ఆర్ ఆర్ ఆర్` రిలీజ్ అవుతుంది. ఈ రెండు సినిమాలు సక్సెస్ అయితే అలియా బ్రాండ్ ఇమేజ్ రెట్టింపు అవుతుంది.