Begin typing your search above and press return to search.
బోయపాటి సినిమాలు మిక్స్ చేసి కొట్టారే
By: Tupaki Desk | 21 Jan 2019 1:16 PM GMTవినయ విధేయ రామ వల్ల బోయపాటి శీను బాగా విమర్శల పాలవుతున్నాడు. జయ జానకి నాయక టైంలోనూ ఇన్ని మాటలు పడలేదు కాని రామ్ చరణ్ ని ప్రెజెంట్ చేసిన తీరుకు సోషల్ మీడియాలో బాగా తలంటించుకున్నాడు శీను. మాస్ పల్స్ బాగా తెలిసిన దర్శకుడు ఇలా చేయడం ఏమిటా అని అందరు ఆశ్చర్యపోయారు. అయితే ఇతర బాషా దర్శకులు మాత్రం మన బోయపాటిని స్ఫూర్తిగా తీసుకుని తమ హీరోలను ఊర మాస్ అవతారంలో చూపించేందుకు తెగ ఉత్సాహ పడుతున్నారు.
నిన్న సీతారామ కళ్యాణ అనే కన్నడ ట్రైలర్ రిలీజ్ అయ్యింది. సిఎం కుమారస్వామి తనయుడు నిఖిల్ గౌడ హీరో. తెలుగులో ఇంతకు ముందు జాగ్వార్ ద్వారా సుపరిచితుడే. అది డిజాస్టర్ కావడంతో మనవాళ్ళు మర్చిపోయారు. ఇతని కొత్త సినిమానే సీతారామ కళ్యాణ. ఇందులో విశేషం ఏమిటంటే అంతా తెలుగు సినిమాల కలబోతగా ఉండటం. ముఖ్యంగా బోయపాటి శీను ఆల్ టైం బ్లాక్ బస్టర్ సరైనోడుతో పాటు జయ జానకి నాయక ఛాయలు పుష్కలంగా ఉండటం. అంతే కాదు శరత్ కుమార్ అచ్చం అలాంటి పాత్రే ఇందులో చేసాడు. కొన్ని సన్నివేశాలు నాగ చైతన్య రారండోయ్ వేడుక చూద్దాంను గుర్తుకు తెస్తాయి. శ్రద్ధగా గమనిస్తే బోలెడు తెలుగు సినిమాల పోలికలు వద్దన్నా కనిపిస్తాయి. దీని సంగీత దర్శకుడు మన అనూప్ రూబెన్సే.
బెల్లంకొండ సాయి శ్రీనివాస్ లాగా అన్ని భారీ ప్రయత్నాలే చేస్తున్న నిఖిల్ గౌడ ఇప్పుడీ సీతరామ కళ్యాణతో పెద్ద బ్రేక్ కోసం ఎదురు చూస్తున్నాడు. శాండల్ వుడ్ టాక్ ప్రకారం ఇది సరైనోడు రీమేకేనట. హర్ష దర్శకత్వం వహించిన ఈ మూవీ త్వరలో విడుదల చేయబోతున్నారు. ఏమైనా మాస్ సినిమాల విషయంలో మన దర్శకుల శైలికి పక్క రాష్ట్రంలో కూడా ఫాలోయర్స్ ఉన్నారని అర్థమైపోయిందిగా. ఒక్క రోజులోనే అర మిలియన్ వ్యూస్ కి ఇది చేరువ కావడం విశేషం