Begin typing your search above and press return to search.
స్పూఫ్ లతో సరిపెట్టిన సెల్ఫీ రాజా
By: Tupaki Desk | 10 Jun 2016 1:12 PM GMTసెల్ఫీ రాజా.. అల్లరి నరేష్ చేస్తున్న కొత్త సినిమా ఇది. ఈవీవీ కొడుకుగా అల్లరి సినిమాతో ఇండస్ట్రీలోకొచ్చిన నరేష్.. తొలి సినిమా నుంచి మిస్టర్ డిపెండబుల్ అయిపోయాడు. ఏడాదికి నాలుగైదు సినిమాలు.. వరుసగా హిట్స్.. మినిమం గ్యారంటీ మూవీస్.. ఇలాంటి పరిస్థితి నుంచి అసలు హిట్ అనేదే లేని స్టేజ్ కి జారిపోయాడు ఈ కామెడీ హీరో. స్టార్ హీరోల స్పూఫ్ లతో కాలం గడిపేయాలనే ఐడియా.. ముందు బాగానే వర్కవుట్ అయినా తర్వాత బెడిసికొట్టేసింది.
జూన్ 10న దివంగత ఈవీవీ 60వ బర్త్ డే సందర్భంగా ప్రత్యేకంగా తన కొత్త సినిమా టీజర్ ఇచ్చాడు అల్లరి నరేష్. టీజర్ ప్రారంభంలో 'పాట్నా పావురాన్ని కాదు.. మైసూర్ మేకను కాదు.. పూనే పావురాన్ని కాదు.. వన్ అండ్ ఓన్లీ రాజా.. సెల్ఫీరాజా' అంటూ సీరియస్ గా చెప్పే కామెడీ డైలాగ్ తప్ప.. ఇందులో ఆకట్టుకునే సందర్భం ఒకటి కూడా కనిపించదు. ఫుల్ ప్లెడ్జెడ్ మాస్ మూవీ రేంజ్ లో కట్ చేసిన టీజర్ మొత్తం స్పూఫ్ లతోనే నింపేశారు.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మూవీ సర్దార్ గబ్బర్ సింగ్,.. అల్లు అర్జున్ సరైనోడు చిత్రాల్లో మాంచి సీన్స్ ను ఇమిటేట్ చేయడం తప్ప.. సెల్ఫీ రాజా టీజర్లో చెప్పుకోవడానికి ఏం లేదనిపించడం ఖాయం. టీజర్ పరిస్థితే ఇలా ఉంటే.. సినిమాని కూడా ఇలాగే ఎక్స్ పెక్ట్ చేయచ్చు. పూర్తి యాభై సినిమాలు కంప్లీట్ చేసుకున్నాక అయినా.. కొత్తగా ఏం ట్రై చేయకుండా.. మళ్లీ స్పూఫ్ లు, ఇమిటేషన్స్ మీదే డిపెండ్ అవ్వాలని ఆలోచించడం ఎందుకో అర్ధం కాని విషయమే.