Begin typing your search above and press return to search.
రిలీజ్ కు రెడీ అయిన 'సెహరి'
By: Tupaki Desk | 30 Nov 2021 1:30 PM GMTహర్ష కనుమల్లి - సిమ్రాన్ చౌదరి హీరో హీరోయిన్లుగా రూపొందిన న్యూ ఏజ్ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ "సెహరి''. జ్ఞాన సాగర్ ద్వారక ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. విర్గో పిక్చర్స్ బ్యానర్ పై అద్వయ జిష్ణు రెడ్డి - శిల్పా చౌదరి సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్నారు. నందమూరి బాలకృష్ణ చేతుల మీదుగా విడుదలైన ఫస్ట్ లుక్ ఈ చిత్రానికి కావాల్సినంత పబ్లిసిటీ తెచ్చిపెట్టింది. ఈ క్రమంలో వచ్చిన టీజర్ - సాంగ్స్ మంచి స్పందన తెచ్చుకున్నాయి.
ముఖ్యంగా 'సెహరి' టైటిల్ సాంగ్ - 'ఇది చాలా బాగుందిలే' పాటలు సోషల్ మీడియాలో యువతను ఎంతగానో ఆకట్టుకున్నాయి. సిద్ శ్రీరామ్ ఆలపించిన “ఇది చాలా బాగుందిలే” పాట 80 లక్షలకు పైగా వ్యూస్ తో శరవేగంగా కోటి వీక్షణలకు దూసుకుపోతోంది. ఇక 'సెహరి' టీజర్ కు యూట్యూబ్ లో ఇప్పటి వరకు 60 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి. ప్రమోషనల్ కంటెంట్ తో ప్రేక్షకులలో ఆసక్తిని కలిగించిన ఈ సినిమా అతి త్వరలో విడుదల కాబోతోందని మేకర్స్ ప్రకటించారు.
నిర్మాత అద్వయ జిష్ణు రెడ్డి మాట్లాడుతూ.. 'సెహరి' టీజర్ మరియు పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా హీరో హర్ష్ కనుమిల్లి నటన చూపరులను ఎంతగానో ఆకట్టుకుంటున్నది. ఎక్కడ కూడా మొదటి సారిగా నటించినట్టుగా కాకుండా ఎంతో అనుభవం ఉన్న నటుడిగా చాలా అధ్బుతమైన ప్రదర్శన కనబరిచాడు. ఉన్నత నిర్మాణ విలువలతో నిర్మించబడిన “సెహరి” సినిమా కుటుంబ సమేతంగా వెళ్ళి హాయిగా నవ్వుకుని ఆనందించదగ్గ సినిమా అవుతుంది అని చిత్ర విజయం పట్ల ధీమా వ్యక్తం చేశారు.
దర్శకుడు జ్ఞానసాగర్ ద్వారక మాట్లాడుతూ.. 'సెహరి' చిత్రంలోని కథ మరియు పాత్రలన్నీ యువతతో పాటుగా కుటుంబ ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా తీర్చిదిద్దామని తెలిపారు. ఇకపోతే 'సెహరి' చిత్రానికి హీరో హర్ష కనుమల్లి కథ అందించడం విశేషం. ప్రశాంత్ ఆర్ విహారీ సంగీతం సమకూర్చారు. అరవింద్ విశ్వనాథన్ సినిమాటోగ్రఫీ అందించగా.. రవితేజ గిరజాల ఎడిటింగ్ వర్క్ చేశారు. సాహి సురేష్ ఆర్ట్ డైరెక్టర్ గా వ్యవహరించారు.
ప్రముఖ సంగీత దర్శకుడు కోటి ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించారు. అభినవ్ గోమఠం - ప్రణీత్ రెడ్డి - అనిషా అల్లా - అక్షిత హరీష్ - బాలకృష్ణ తదితరులు ఇతర పాత్రల్లో కనిపించనున్నారు. 'సెహరి' విడుదల తేదీని మేకర్స్ త్వరలోనే ప్రకటించనున్నారు.