Begin typing your search above and press return to search.
ఆ ఖరీదైన బంగ్లా ఎవరిది? కమ్ముల పెట్టుబడులు ఎక్కడ పెడతారు?
By: Tupaki Desk | 21 Sep 2021 9:30 AM GMTటాలీవుడ్ ఇన్నోవేటివ్ డైరెక్టర్ శేఖర్ కమ్ములా సింప్లిసిటీ గురించి తెలిసిందే. సినిమాలపై ఫ్యాషన్ తో లక్షల్లో జీతం వచ్చే సాప్ట్ వేర్ ఉద్యోగాన్ని వదిలేసి పరిశ్రమకొచ్చి డైరెక్టర్ గా ఎదిగారు. అయినా ఆయన మూలాలు మర్చిపోలేదు. ఖరీదైన జీవితం కళ్ల ముందు ఉన్నా ఆయన మాత్రం సికింద్రాబాద్ పద్మారావు నగర్ వదిలి బయటకు రారు. షూటింగ్ ఉంటే ఆన్ సెట్లో.. లేకపోతే పద్మారావు నగర్ ఆఫీస్.. ఇంట్లోనే ఎక్కువగా ఉంటారు. హీరోలకు స్క్రిప్ట్ వినిపించాలి అంటే మాత్రమే జూబ్లిహిల్స్..బంజారా హిల్స్ వైపు చూస్తారు. వచ్చి పనిచూసుకుని వెంటనే వెళ్లిపోతారు. పరిశ్రమలో ఆయనకున్న స్నేహితులు కూడా చాలా తక్కువే.
పరిశ్రమే ఆయన ప్రతిభను గుర్తించి మాట్లాడుతుంది కాబట్టి..ఆయనకు స్నేహితులతో పనికూడా లేదు. ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగి ఉండాలనే ఆయన యాటిట్యూడ్ ఆయన లో స్పెషల్ క్వాలిటీ. వేదికలపై మాట్లాడేది కూడా చాలా తక్కువ. పరిమితంగానే మాట్లాడుతారు. ప్రస్తుతం ఆయన నాగ చైతన్యతో తెరకెక్కించిన `లవ్ స్టోరీ` రిలీజ్ నేపథ్యంలో ప్రచారంలో భాగంగా కొన్ని ఇంటర్వ్యూల్లో ఓ బంగ్లా కథ తెరపైకి వచ్చింది. ఆయనకు సిటీ ఔట్ స్కర్ట్స్ లో 10 ఎకరాల్లో 70 కోట్ల ఖరీదైన ఓ బంగ్లా ఉందని..ఖాళీ సమయం దొరికితే పద్మారావు నగర్ తర్వాత అక్కడే ఎక్కువగా ఉంటారని చాలా కాలంగా వినిపిస్తోంది.
తాజాగా ఈ రూమర్ పై కమ్ములా స్పందించారు. ఆ బంగ్లా నాది కాదు. నాకు తెలిసిన వ్యక్తిది. ఆ బంగ్లా పక్కనే నాకు స్థలాలున్నాయి. వాటిని చూడటానికి అప్పుడప్పుడు వెళ్తా. ఆ పక్కనే తెలిసిన వాళ్ల భవంతి కూడా ఉండటంతో అక్కడ సమయం గడుపుతా. అంతేగానీ 70 కోట్ల ఖరీదైన బంగ్లా నాది కాదు ! అంటూ విన్నవించుకుంటున్నారు. అలాగే శేఖర్ కమ్ములా ఒక్కో సినిమాకు ఏడు నుంచి ఏనిమిది కోట్లు పారితోషికం తీసుకుంటారని ఈ సందర్భంగా కథనాలు వెలువడుతున్నాయి. ఆయన పారితోషికాన్ని సినిమాలపైనే పెట్టుబడిగా పెడతారు. స్థలాలు కొంటారని గుసగుస వినిపిస్తోంది.