Begin typing your search above and press return to search.

శేఖర్‌ కమ్ముల మళ్లీ అదే సెంటిమెంట్‌..!

By:  Tupaki Desk   |   26 Nov 2018 4:56 AM GMT
శేఖర్‌ కమ్ముల మళ్లీ అదే సెంటిమెంట్‌..!
X
దర్శకుడు శేఖర్‌ కమ్ముల గత ఏడాది ‘ఫిదా’ చిత్రంను చేసి మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. సంవత్సరం నర అయినా కూడా ఈ దర్శకుడు తదుపరి చిత్రంను పట్టాలెక్కించలేదు. ఇటీవలే కొత్త హీరోతో ఒక చిత్రాన్ని చేయబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటించాడు. ప్రముఖ డిస్ట్రిబ్యూటర్‌ ఏషియన్‌ సునీల్‌ ఈ చిత్రంతో నిర్మాతగా పరిచయం కాబోతున్నాడు. డాన్స్‌ నేపథ్యంలో సాగే కథ అవ్వడంతో కొత్త హీరోకు డాన్స్‌ పై ఎక్కువ శిక్షణ ఇప్పిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇక ఈ చిత్రంలో హీరోయిన్‌ కూడా కొత్త అమ్మాయే నటించబోతుంది.

శేఖర్‌ కమ్ముల కెరీర్‌ ను ఆరంభించినప్పటి నుండి కూడా ఎక్కువ శాతం కొత్త హీరోయిన్స్‌ తోనే వర్క్‌ చేశాడు. శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో తెలుగు ప్రేక్షకులు పరిచయం అయిన హీరోయిన్స్‌ మంచి ఇమేజ్‌ ను సొంతం చేసుకుని స్టార్‌ హీరోయిన్స్‌ గా కూడా గుర్తింపు దక్కించుకున్నారు. ఈయన సక్సెస్‌ లలో ఎక్కువగా కొత్త వారితో చేసిన సినిమాలే ఉన్నాయి. అందుకే ఈసారి కూడా ఆ సెంటిమెంట్‌ ప్రకారమే కొత్త అమ్మాయిని తన తాజా చిత్రానికి ఎంపిక చేసినట్లుగా తెలుస్తోంది.

సినిమా డాన్స్‌ ప్రధానమైన సినిమా అవ్వడం వల్ల విజయవాడకు చెందిన ఒక నృత్యకారిణిని ఎంపిక చేసినట్లుగా తెలుస్తోంది. ఇప్పటి వరకు హీరో - హీరోయిన్‌ పై ఎలాంటి స్పష్టత ఇవ్వని శేఖర్‌ కమ్ముల వచ్చే నెల మొదటి వారంలో చిత్రాన్ని సెట్స్‌ పైకి తీసుకు వెళ్లబోతున్నాడు. చిన్న బడ్జెట్‌ చిత్రంగా ఈ చిత్రంను విభిన్నమైన కథాంశంతో తెరకెక్కించబోతున్నాడు శేఖర్‌ కమ్ముల. మరి ఈ చిత్రంతో ఈ దర్శకుడు మరోసారి మ్యాజిక్‌ చేస్తాడా అనేది చూడాలి.