Begin typing your search above and press return to search.
కమ్ముల సార్.. ఇది మరీ టూమచ్?
By: Tupaki Desk | 19 July 2017 7:19 AM GMT‘‘స్టీరియో టైప్ స్టోరీలను ఈ సినిమా బ్రేక్ చేస్తుంది’’
‘‘ప్రతి సినిమాలో ఉండే రొటీన్ పాత్రల్ని అధిగమించి రిఫ్రెషింగ్ గా అనిపిస్తుంది’’
‘‘ఇలాంటి సినిమా ఇంతకుముందెన్నడూ రాలేదని గట్టిగా చెప్పగలను’’
‘‘కమర్షియల్ సినిమాల పొల్యూషన్లో ఈ సినిమా ఒక ఫ్రెష్ ఎయిర్ లాగా ఉంటుంది’’
‘వాన జల్లు పడుతుంటే ఎంత హాయిగా ఉంటుందో, ఈ సినిమా చూస్తుంటే అంత హాయిగా ఉంటుంది’’
‘‘ఇప్పుడే సినిమా చూసొచ్చాను. మైండ్ బ్లోయింగ్. చూసిన ప్రతి ఒక్కరినీ రెండు మూడు రోజుల దాకా వదలదు. వాళ్లు రెండు మూడు సార్లు చూస్తారు. దుమ్ము దులుపుతుందంతే’’
‘‘ఒక్కటి మాత్రం చెప్పగలను. నా సినిమాలు లైబ్రరీలో ఉంటాయి. ఎవరూ నన్ను టచ్ చేయలేరు’’
తన కొత్త సినిమా ‘ఫిదా’ ప్రమోషన్లలో భాగంగా మీడియాను కలిసిన శేఖర్ కమ్ముల చేసిన వ్యాఖ్యలివి. ఎప్పుడూ తన సినిమాల గురించి కానీ.. తన గురించి కానీ గొప్పగా చెప్పుకోని శేఖర్ కమ్ముల ఈసారి మాత్రం మరీ ఇంత టూమచ్ గా చెప్పుకోవడం అందరికీ ఆశ్చర్యం కలిగించింది. ఆ మధ్య ఆడియో వేడుకలోనే కమ్ముల ఎక్కువ మాట్లాడన్న ఫీలింగ్ కలిగితే.. ఇప్పుడు ఆ ఫీలింగ్ మరీ ఎక్కువైంది. తన సినిమాపై కమ్ములకు కాన్ఫిడెన్స్ ఉండొచ్చు గాక.. కానీ మరీ ఈ స్థాయిలో దాని గురించి.. తన గురించి.. గొప్పలు చెప్పుకోవడమే ఆశ్చర్యం. ఇలా మరో దర్శకుడు మాట్లాడితే జనాలు పెద్దగా పట్టించుకోరు. కానీ కమ్ముల ఇలా మాట్లాడేసరికే జనాలకు ఏదోలా అనిపిస్తోంది. కమ్ముల లాంటి వాళ్లు తమ గురించి ఎక్కువ చెప్పుకుంటే బాగోంది. ఇంతకుముందు కమ్ముల సినిమాలే మాట్లాడేవి. అతను సైలెంటుగా ఉండేవాడు. మాట్లాడినా తన సినిమాల గురించి గొప్పలు చెప్పుకునేవాడు కాదు. కానీ ‘ఫిదా’ దగ్గరికి వచ్చేసరికి ఈ మార్పేమిటో?