Begin typing your search above and press return to search.

ఆ ఇద్దరికి పరీక్షలు పెడుతున్న శేఖర్‌ కమ్ముల

By:  Tupaki Desk   |   20 Oct 2018 6:17 AM GMT
ఆ ఇద్దరికి పరీక్షలు పెడుతున్న శేఖర్‌ కమ్ముల
X
‘ఫిదా’ చిత్రం తర్వాత ఇప్పటి వరకు తదుపరి చిత్రాన్ని పట్టాలెక్కించని శేఖర్‌ కమ్ముల ఇటీవలే ప్రముఖ డిస్ట్రిబ్యూటర్‌ ఏషియన్‌ సునీల్‌ నిర్మాణంలో ఒక చిత్రం తెరకెక్కించబోతున్నట్లుగా ప్రకటించిన విషయం తెల్సిందే. ఇప్పటికే కొత్త సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్‌ వర్క్‌ ను శేఖర్‌ కమ్ముల మొదలు పెట్టాడు. కొత్త హీరోతో ఈ చిత్రంను శేఖర్‌ కమ్ముల తెరకెక్కించబోతున్నాడనే విషయం తెల్సిందే. ఆ కొత్త హీరో ఎవరు అనే విషయంలో ఇంకా క్లారిటీ రాలేదు. పువురికి ఆడిషన్స్‌ నిర్వహించి ఇద్దరిని ఓకే చేసిన శేఖర్‌ కమ్ముల అందులో ఒకరిని తన సినిమాకు హీరోగా ఎంపిక చేయబోతున్నాడు.

ప్రస్తుతం ఆ ఇద్దరిలో ఒక కుర్రాడిని ఎంపిక చేసేందుకు దర్శకుడు శేఖర్‌ కమ్ముల వారికి పరీక్షలు పెడుతున్నట్లుగా సమాచారం అందుతోంది. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం శేఖర్‌ కమ్ముల తదుపరి చిత్ర స్క్రిప్ట్‌ లో డాన్స్‌ కు ఎక్కువ ప్రాముఖ్యత ఉంటుందట. కథలో భాగంగా డాన్స్‌ ఉంటుందని - అందుకే తన హీరోకు డాన్స్‌ లో ఎక్కువ ట్యాలెంట్‌ ఉండాలని శేఖర్‌ కమ్ముల భావిస్తున్నాడు. అందుకే ఇద్దరికి డాన్స్‌ లో పరీక్షలు జరుగుతున్నాయని సమాచారం అందుతుంది.

మామూలుగా అయితే ఆడిషన్స్‌ అంటే డైలాగ్‌ డెలవరీ - నటన - బాడీ లాంగ్వేజ్‌ ను చూస్తారు. కాని శేఖర్‌ కమ్ముల తన కథకు తగ్గట్లుగా ఉండాలని డాన్స్‌ పరీక్ష పెట్టాడు. శేఖర్‌ కమ్ముల ఎంపిక చేసిన ఇద్దరిలో ప్రముఖ నిర్మాత దానయ్య తనయుడు ఉన్నాడు. ప్రస్తుతం దానయ్య తనయుడితో పాటు కొత్త కుర్రాడు ఇద్దరు కూడా శేఖర్‌ కమ్ముల టెస్టును ఎదుర్కొంటున్నారు. అతి త్వరలోనే వారిద్దరిలో ఎవరితో శేఖర్‌ కమ్ముల సినిమా చేస్తాడో చూడాలి. దానయ్య కొడుకుతో శేఖర్‌ కమ్ముల సినిమా చేసే అవకాశం ఉందని ఫిల్మ్‌ సర్కిల్స్‌ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. కాని అధికారిక ప్రకటన మాత్రం ఎలా ఉంటుంది - ఎవరు శేఖర్‌ కమ్ముల తదుపరి హీరో అనే ఆసక్తి అందరిలో కనిపిస్తుంది.