Begin typing your search above and press return to search.
అల్లు హీరో ఆనంద్ అవుతాడా
By: Tupaki Desk | 18 Jun 2018 11:52 AM GMTనా పేరు సూర్య ఊహించిన దాని కన్నా పెద్ద ఝలక్ ఇచ్చింది స్టైలిష్ స్టార్ కి. రేస్ గుర్రం లాంటి బ్లాక్ బస్టర్ కి కథకుడిగా వక్కంతం వంశీ మీద పెట్టుకున్న నమ్మకం బాక్స్ ఆఫీస్ సాక్షిగా నీరుగారిపోయింది. కొన్ని విమర్శలు అందుకున్న డీజే సినిమా దీని కన్నా ఎన్నో రేట్లు మెరుగ్గా ఆడటం ఫాన్స్ సైతం జీర్ణించుకోలేకపోతున్నారు. అయినా ఇండస్ట్రీలో జయాపజయాలు సహజం కాబట్టి తన కొత్త సినిమా మీద బన్నీ ఫోకస్ పెడుతున్నాడు. ఇప్పటికే లైన్ లో విక్రమ్ కుమార్ ఉన్నాడు. అఖిల్ తో తీసిన హలో ఊహించని విధంగా షాక్ ఇవ్వడంతో ఇతనూ స్క్రిప్ట్ విషయంలో జాగ్రత్తగా ఉంటున్నాడు. అల్లు అర్జున్ కు ఒక లైన్ చెప్పడం ఇంప్రెస్ అయిన బన్నీ ఫుల్ వెర్షన్ విన్నాక నిర్ణయం తీసుకుందామని చెప్పడంతో త్వరలో ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. విక్రమ్ తో పాటు మరో దర్శకుడు కూడా స్టైలిష్ స్టార్ లిస్ట్ లో ఉండటం ఆసక్తిని రేపుతోంది. ఆయనే శేఖర్ కమ్ముల.
సూపర్ హిట్స్ ఎన్ని చేసినా శేఖర్ కమ్ములకు రెండో సినిమా ఆనంద్ తో వచ్చిన గుర్తింపు చాలా ప్రత్యేకం. ఇప్పటికే శేఖర్ అంటే గుర్తొచ్చే పేరు ఆ సినిమానే. శంకర్ దాదా ఎంబిబిఎస్ తో పోటీ పడి మరీ వంద రోజులు ఆడింది అప్పట్లో. లాస్ట్ ఇయర్ పెద్ద హీరోల సినిమాలకు ధీటుగా వసూళ్ల సునామి రేపిన ఫిదా తర్వాత శేఖర్ కమ్ముల కొత్త సినిమా ఏదీ ఒప్పుకోలేదు. తాజా సమాచారం మేరకు శేఖర్ కమ్ముల ఈ మధ్యే బన్నీకి ఓ కథ వినిపించాడట. నచ్చిన అల్లు హీరో వర్క్ అవుట్ చేద్దామని హామీ ఇచ్చినట్టు తెలిసింది. మరి విక్రమ్ ది ఫస్ట్ ఓకే చేస్తాడా లేక శేఖర్ కు గ్రీన్ సిగ్నల్ ఇస్తాడా అన్నది మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్. శేఖర్ కమ్ముల హ్యాపీ డేస్-ఆనంద్ లాంటి అల్ టైం హిట్స్ ఎన్ని చేసినా స్టార్ హీరోతో మాత్రం చేయలేకపోయాడు. ఐదేళ్ల క్రితం మహేష్ బాబుతో స్టోరీ డిస్కషన్ స్టేజి లోనే ఓ ప్రాజెక్ట్ ఆగిపోయిందని గతంలో వార్తలు వచ్చాయి. ఇప్పుడు మాత్రం బన్నీ సినిమా కోసం అడుగులు వేగంగా పడుతున్నాయట. చాలా సాఫ్ట్ గా ఉండే హీరో పాత్రలను డిజైన్ చేసే శేఖర్ ఒకవేళ ఈ సినిమా కనక ఓకే అయితే మాస్ హీరోయిజంకి కేరాఫ్ అడ్రెస్ గా ఉన్న బన్నీని ఎలా చూపిస్తాడు అనేది ఆసక్తికరమే. శేఖర్ సరైనోడుగా మారతాడా లేక అల్లు అర్జున్ ఆనంద్ తరహా పాత్రలో ఒదిగిపోతాడా ఇది ఓకే అయ్యాక మాట్లాడుకోవచ్చు.