Begin typing your search above and press return to search.
వచ్చే ఏడాది వరకు ఖాళీయే
By: Tupaki Desk | 10 Oct 2017 6:23 AM GMTటాలీవుడ్ లో ఎంత మంది దర్శకులు ఉన్నా వారి సినిమాలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దర్శకులు కొందరే ఉన్నారు. ఏ దర్శుకుడు అయినా మాస్ క్లాస్ తరహా సినిమాలను తియ్యగలడు.కానీ ఎంత పెద్ద దర్శకుడు అయినా కరెక్ట్ గా శేఖర్ కమ్ముల సినిమాలాగా తియ్యలేడు. చూస్తే సినిమాలు నార్మల్ గానే ఉంటాయి. కాని అందులో ఏదో తెలియని మ్యాజిక్ ఆయన సినిమాలో ఉంటుంది.
ఆయన కెరీర్ లో ఒక్క అనామిక తప్పితే అన్ని సినిమాలు ఎదో ఒక వర్గాన్ని ఆకట్టుకున్నాయి. లీడర్ సినిమా అంతగా అడకపోయినా ఇప్పటికి ఆ సినిమాను ఇష్టపడేవారు చాలామందే ఉన్నారు. ఇక లేటెస్ట్ ఫిదా గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. హ్యాపీ డేస్ తర్వాత ఆ స్థాయి విజయాన్ని అందుకున్నాడు. అంతే కాకుండా వరుణ్ తేజ్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా ఆ సినిమా నిలిచింది. దీంతో ఆయన నెక్స్ట్ సినిమా ఎలా ఉండబోతోందా అని ప్రతి ఒక్కరు ఎదురుచూస్తున్నారు. నిజం చెప్పాలంటే ఫిదా సినిమా తర్వాత ఇప్పటివరకు రిలీజ్ అయిన సినిమాలు ఏవీ ఎమోషనల్ గా అంతగా ఆకట్టుకోలేకపోయాయి.
దీంతో శేఖర్ కమ్ముల లాంటి ఒక సినిమా వస్తే ఎంత బవుంటుందో అని అందరు అనుకుంటున్నారు. అయితే ఆయన మాత్రం ప్రస్తుతం ఫిదా సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్నారట. భార్య పిల్లలతో హ్యాపీగా గడుపుతున్నారు. బడా నిర్మాతల నుండి ఆఫర్స్ వస్తున్నా కూడా శేఖర్ కమ్ముల ఏ మాత్రం తొందరపడకుండా కొన్ని రోజుల తర్వాత ఐడియాలను పేపర్ పై దింపేస్తారట. ఫుల్ స్క్రిప్ట్ అయ్యాక అప్పుడు గాని ఒకే చెప్పాడట. అంటే దాదాపు శేఖర్ గారు వచ్చే ఏడాది వరకు ఖాళీనే..