Begin typing your search above and press return to search.
కమ్ముల ఇంకా కాన్సెప్టే కమిట్ కాలేదట
By: Tupaki Desk | 20 March 2018 11:30 PM GMTదర్శకుడు శేఖర్ కమ్ముల విభిన్న శైలిలో చిత్రాలు తీస్తుంటాడు. ఆనంద్ నుంచి రీసెంట్ గా వచ్చిన ఫిదా వరకు.. తన స్టైల్ లోనే మూవీస్ ను తీస్తున్నాడు. కానీ ఫిదా మూవీ సక్సెస్ ఈయన క్రేజ్ ను ఓ రేంజ్ కి తీసుకెళ్లిపోయింది. మీడియం బడ్జెట్ మూవీతో 50 కోట్ల కలెక్షన్స్ వసూలు చేసి కొత్త చరిత్ర సృష్టించాడు శేఖర్ కమ్ముల.
ఇంత పెద్ద సక్సెస్ తర్వాత కుప్పలు తెప్పలుగా అవకాశాలు రావడంలో ఆశ్చర్యమేమీ లేదు. పైగా ప్రతీ హీరో ఈయన డైరెక్షన్ లో ఒకసారి అయినా చేయాలనీ భావించేంతటి గుర్తింపు ఉన్న శేఖర్ కమ్ములకు ఇంకా ఎక్కువే ఆఫర్స్ వస్తాయి. ఈ నిర్మాత నుంచి అడ్వాన్స్.. ఈ హీరోతో సినిమా అంటూ ఇప్పటివరకూ రకరకాల మాటలు వినిపించాయి. కానీ వీటిలో ఏ ఒక్కదానిలోనూ వాస్తవం లేదట. అసలు శేఖర్ కమ్ముల ఇంకా స్క్రిప్ట్ రాయడం కూడా స్టార్ట్ చేయలేదని తెలుస్తోంది. సహజంగా తన సినిమాల మధ్య రెండేళ్య గ్యాప్ ఇచ్చే ఈ దర్శకుడు.. తన తర్వాతి చిత్రాన్ని ఏ కాన్సెప్ట్.. ఏ జోనర్ లో తీయాలో కూడా ఫిక్స్ కాలేదట.
మొదట కాన్సెప్ట్ ఫైనల్ కావాలి.. ఆ తర్వాత స్క్రిప్ట్ ప్రిపేర్ చేయాలి.. అప్పుడు ఆయా క్యారెక్టర్లు డిమాండ్ చేసిన మేరకు నటీనటుల ఎంపిక చేయాలి. ఇదీ శేఖర్ కమ్ముల స్టైల్. ఇప్పుడూ అదే ఫాలో అవుతాడట. కథే మొదలుపెట్టని సిట్యుయేషన్ లో ఫలానా హీరోతో సినిమా అంటే నవ్వుకోవాల్సిన విషయం అంటున్నారు సన్నిహితులు. ప్రస్తుతం తన ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్నాడట ఈ డైరెక్టర్.