Begin typing your search above and press return to search.
మళ్లీ రీషూట్లేంటండీ బాబూ..
By: Tupaki Desk | 4 July 2017 7:15 AM GMTఅంతా అనుకున్న ప్రకారం జరిగి ఉంటే శేఖర్ కమ్ముల-వరుణ్ తేజ్ ల ‘ఫిదా’ కొన్ని నెలల కిందటే రిలీజైపోయి ఉండాలి. కానీ ‘మిస్టర్’ షూటింగ్ సందర్భంగా వరుణ్ గాయపడటంతో దాంతో పాటుగా ‘ఫిదా’ కూడా ఆలస్యమైంది. ఐతే పక్కా స్క్రిప్టుతో రంగంలోకి దిగిన కమ్ముల ‘ఫిదా’ కోసం మరీ ఎక్కువ వర్కింగ్ డేస్ తీసుకోలేదని.. అనుకున్న ప్రకారమే సినిమాను పూర్తి చేశాడని సమాచారం. ఈ సినిమా షూటింగ్ పూర్తయినట్లు చాన్నాళ్ల కిందటే వరుణ్ తేజ్ ట్విటర్లో ప్రకటించాడు.
ఐతే ‘ఫిదా’ షూటింగ్ మళ్లీ జరిగిందని.. ఇప్పుడే టాకీ పార్ట్ పూర్తి చేశారని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. టాకీ పార్ట్ పూర్తయ్యాక రషెస్ చూసిన నిర్మాత దిల్ రాజు.. కొన్ని ఎపిసోడ్ల విషయంలో అభ్యంతరాలు వ్యక్తం చేశాడట. కమ్ముల తనదైన శైలిలో మరీ క్లాస్ గా కొన్ని సన్నివేశాలు తీయడంతో వాటిని సామాన్య ప్రేక్షకులకూ కనెక్టయ్యే రీతిలో రీషూట్ చేయమని చెప్పాడట. దిల్ రాజు జడ్జిమెంట్ మీద ఉన్న నమ్మకంతో కమ్ముల కూడా ఆ మార్పులు చేయడానికి ఓకే చెప్పాడట.
ఒకప్పుడైతే రీషూట్ అన్న మాట వినిపిస్తే జనాలకు నెగెటివ్ ఫీలింగ్ వచ్చేసేది. కానీ నాగార్జున ఆ ఫీలింగ్ ను మార్చేశాడు. సినిమా పూర్తయ్యాక ఒకసారి సరి చూసుకుని.. రిలీజ్ కంటే ముందే తప్పులు దిద్దుకుంటే తప్పేంటన్న ఆయన లాజిక్ తో అందరూ ఏకీభవించడం మొదలుపెట్టారు. సోగ్గాడే చిన్నినాయనా.. రారండోయ్ వేడుక చూద్దాం సినిమాల విషయంలో నాగ్ అలాగే చేశాడు. రీషూట్ల గురించి ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇప్పుడు ‘ఫిదా’ విషయంలోనూ అలాగే మార్పులు చేర్పులు జరుగుతున్నాయి. కాకపోతే ఈ నెల 21న రిలీజ్ అంటుండగా.. ఇంకా రీషూట్లేంటన్న దానిపైనే కొంత డిస్కషన్ నడుస్తోంది. ఏదేమైనా హిట్టు కోసం ఆశగా ఎదురు చూస్తున్న వరుణ్.. కమ్ములలకు ‘ఫిదా’ మంచి అనుభవాన్నిస్తుందని ఆశిద్దాం.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/