Begin typing your search above and press return to search.
మీ కృతజ్ఞత భావన.. నాకు గొప్ప అవార్డు: ప్రముఖ డైరెక్టర్
By: Tupaki Desk | 13 May 2020 4:30 PM GMTడైరెక్టర్ శేఖర్ కమ్ముల ఏప్రిల్ నెలలో 1000 మంది పారిశుద్ధ్య సిబ్బందికి నెలరోజుల పాటు బాదంపాలు, మజ్జిగ ఉచితంగా అందిస్తానని ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం లాక్ డౌన్ కారణంగా అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పేదలని ఆదుకునేందుకు దాతలు కూడా ముందుకు వస్తున్నారు. చిత్ర పరిశ్రమ నుంచి కూడా భారీగా విరాళాల సేకరణ జరిగింది. కానీ డైరెక్టర్ శేఖర్ కమ్ముల కాస్త భిన్నంగా ఆలోచించారు. లాక్ డౌన్ కారణంగా ట్రాన్స్ జెండర్లు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీనితో శేఖర్ కమ్ముల వారికి తనకు తోచిన సాయం అందించారు. ఈ విషయాన్ని ట్రాన్స్ జెండర్లే బయట పెడుతూ శేఖర్ కమ్ములకు కృతజ్ఞతలు తెలిపారు. తాజాగా మరోసారి శేఖర్ కమ్ముల తన మంచి మనసు చాటుకున్నారు. గాంధీ ఆసుపత్రిలోని పారిశుద్ధ్య కార్మికులకు ప్రస్తుతం ఆయన బాదం పాలు, మజ్జిగ సరఫరా చేస్తున్నారు.
దీనితో శేఖర్ కమ్ములకు కృతజ్ఞతలు తెలిపేందుకు పారిశుద్ధ్య కార్మికులంతా ఒక్కటయ్యారు. గాంధీ ఆసుపత్రి ఆవరణలో థాంక్యూ శేఖర్ కమ్ముల అని ప్లకార్డుల ద్వారా తమ కృతజ్ఞత భావాన్ని తెలుపుతూ ప్రదర్శించారు. పారిశుధ్య కార్మికుల కృతజ్ఞత భావానికి.. శేఖర్ కమ్ముల స్పందిస్తూ.. మీ ప్రదర్శన నాకు దక్కిన అతి పెద్ద అవార్డుగా భావిస్తున్నా.. అంటూ శేఖర్ కమ్ముల సోషల్ మీడియాలో శేఖర్ కమ్ముల పోస్ట్ చేశారు. ఇక దర్శకుడిగా శేఖర్ కమ్ముల తన సినిమాలలో ఎలాంటి హంగులు, ఆర్భాటాలు లేకుండా రూపొందిస్తారు. అదే శేఖర్ కమ్ముల ప్రత్యేకత. శేఖర్ కమ్ముల ఎలాంటి వివాదాలకు తావు లేకుండా తన పని తాను చేసుకుంటారు. ఆయన మనసున్న మంచి మనిషి అని ఇంతకాలం ఆయనను దగ్గరగా చూసిన వాళ్ళకే తెలుసు. కానీ ఇప్పుడు శేఖర్ కమ్ముల అంటే ఏంటి.. అనేది అందరికి అర్ధమవుతుంది.