Begin typing your search above and press return to search.
తెలుగులో ఒక్కటే కాదు ముందు ముందు మరెన్నో
By: Tupaki Desk | 25 Jun 2021 11:30 PM GMTతమిళ స్టార్ హీరో ధనుష్ పాన్ ఇండియా అప్పీల్ ఉన్న హీరో అంటూ ఆయన అభిమానులు అంటూ ఉంటారు. హిందీలో కూడా మంచి గుర్తింపు ఉన్న ఈ హీరోకు తెలుగు లో ఇప్పటి వరకు పెద్దగా మార్కెట్ క్రియేట్ అయ్యిందే లేదు. అందుకే ఆయన తెలుగు మార్కెట్ పై దృష్టి పెట్టాడు. అందుకే తెలుగు సినిమా లు చేయడం ద్వారా ఇక్కడ స్థానం ఏర్పర్చుకోవాలనే నిర్ణయానికి వచ్చారని తెలుస్తోంది. తమిళం మరియు తెలుగు తో పాటు హిందీలో కూడా తన సినిమా లు విడుదల అయ్యేలా ధనుష్ వరుసగా అన్ని భాషల సినిమా లు చేస్తూ వస్తున్నాడు.
ఇప్పటికే హిందీ సినిమా చేసిన ధనుష్ ఇప్పుడు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఒక తెలుగు సినిమా ను చేస్తున్నాడు. అది తమిళం మరియు హిందీ ల్లో కూడా విడుదల కాబోతుంది. కేవలం శేఖర్ కమ్ముల సినిమా మాత్రమే కాకుండా తెలుగులో మరి కొన్ని సినిమాలను కూడా ధనుష్ చేసేందుకు సిద్దం అయ్యాడు. ద్విభాష త్రిభాష సినిమా గా చేయడం వల్ల అక్కడ ఇక్కడ మంచి బిజినెస్ అవ్వడంతో పాటు ప్రేక్షకులకు మరింత చేరువ అయ్యే అవకాశం ఉందని ధనుష్ భావిస్తున్నాడట.
విశ్వసనీంగా అందుతున్న సమాచారం ప్రకారం ఇప్పటికే ధనుష్ రెండవ తెలుగు సినిమా కోసం స్క్రిప్ట్ విన్నాడట. ప్రముఖ నిర్మాత అడ్వాన్స్ కూడా ఇచ్చాడని తెలుస్తోంది. శేఖర్ కమ్ముల మాదిరిగానే ఆ యువ దర్శకుడు కూడా తెలుగు ప్రేక్షకుల ముందుకు ఆయన్ను తెలుగు స్టైల్ లో తీసుకు రాబోతున్నాడని తెలుస్తోంది. ముందు ముందు ధనుష్ నుండి తెలుగులో మరిన్ని సినిమాలు వస్తాయి. ఎందుకంటే ఆయన తెలుగు మార్కెట్ లో మరింతగా దూసుకు పోవాలి. ఆయన నటించే సినిమా డబ్బింగ్ అయినా మినిమంగా పాతిక నుండి ముప్పై కోట్ల వరకు బిజినెస్ చేసేలా క్రేజ్ తెచ్చుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నాడు. మరి ఆ ప్రయత్నంలో ధనుష్ ఏమేరకు సఫలం అవుతాడో చూడాలి.