Begin typing your search above and press return to search.

కొమ్ములపై కమ్ముల ఇచ్చిన కౌంటర్

By:  Tupaki Desk   |   3 April 2018 12:39 PM GMT
కొమ్ములపై కమ్ముల ఇచ్చిన కౌంటర్
X
టాలీవుడ్ నటి శ్రీరెడ్డి ఇప్పుడు తెగ సెన్సేషన్ అయిపోయింది. ఎప్పటికప్పుడు కొత్త కొత్త పేర్లు చెబుతూ హంగామా చేస్తున్న ఈ యాక్ట్రెస్.. రీసెంట్ గా సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ ద్వారా పెద్ద సెన్సేషన్ నే క్రియేట్ చేసింది. కొమ్ములు తిరిగిన శేఖరుడు.. అంటూ పేరు చెప్పకుండానే శేఖర్ కమ్ముల అని అర్ధం అయేలా నానా మాటలు అనింది.

తనపై వచ్చిన ఆరోపణలకు ఇప్పుడు శేఖర్ కమ్ముల రియాక్ట్ అయ్యాడు. ఫేస్ బుక్ లో తన పేజ్ లో తెలుగు ఇంగ్లీష్ రెండు భాషల్లోనూ ఓ సుదీర్ఘమైన పోస్ట్ నే పెట్టాడు. ' నన్ను కించపరుస్తూ, సోషల్ మీడియాలో నిన్న వచ్చిన పోస్ట్, నా దృష్టికి వచ్చింది. ఆ పోస్ట్ లో ప్రతీ మాట అబద్ధం. అసభ్యం. అవమానకరం. ఆ పోస్ట్ నాకు, నా కుటుంబానికి, నన్ను గౌరవించేవారికి చాలా మనస్థాపం కలిగించింది. నేను ఎప్పుడూ కలవని, అసలు చూడనే చూడని, కనీసం ఫోన్లో కుడా మాట్లాడని అమ్మాయి , నా గురించి ఆధారం లేని ఆరోపణలు చేయటం షాకింగ్ గా ఉంది. ఈ దిగజారుడు చర్య వెనక ఎవరున్నా, వారి ఉద్దేశం ఏమైనా, నేను చెప్పదల్చుకున్నది ఒకటే. ఇది తప్పు - నేరం - అనైతికం' అంటూ శ్రీరెడ్డి పేరు చెప్పకుండా తన అభిప్రాయాన్ని చెప్పాడు శేఖర్ కమ్ముల.

'స్త్రీల సమానత్వం, సాధికారతలని నేను ఎంత నమ్ముతానో నా సినిమాలు - నా కార్యక్రమాలు చూస్తే అర్ధమౌతుంది. నా వ్యక్తిత్వం - నమ్మే విలువలు నా ప్రాణం కంటే ముఖ్యం. వాటి మీద బురద జల్లే ప్రయత్నం చేస్తే, వదిలి పెట్టే ప్రసక్తి లేదు. ఆ పోస్ట్ లోని ప్రతీ మాట తప్పు అని ఒప్పుకొని, క్షమాపణ చెప్పకపోతే, చట్టపరంగా చర్యలు తీసుకుంటాను' అన్నాడు శేఖర్ కమ్ముల.

నిజానికి శేఖర్ కమ్ముల ఇండస్ట్రీలోనే ఉన్నా.. సినిమాలు తీస్తున్న సమయంలో కూడా చాలా సైలెంట్ గా ఉంటాడనే టాక్ ఉంది. తెలుగు అమ్మాయిలను తీసుకోకపోవడం అనే మాటలో అంతో ఇంతో వాస్తవం ఉన్నా.. ఇలాంటి మాటలు ఆరోపణలు ఎప్పుడూ వినిపించలేదు. ఇప్పుడు శ్రీరెడ్డి నేరుగా శేఖర్ కమ్ములను కార్నర్ చేసేందుకు ప్రయత్నించడాన్ని ఎలా డిఫెండ్ చేసుకుంటుందో చూడాలి.