Begin typing your search above and press return to search.

బాలీవుడ్ డైరెక్టర్లకు గట్టిగా ఇచ్చాడు

By:  Tupaki Desk   |   16 Dec 2018 1:30 AM GMT
బాలీవుడ్ డైరెక్టర్లకు గట్టిగా ఇచ్చాడు
X
గతంలో సౌత్ ఇండియన్ సినిమాలంటే బాలీవుడ్ జనాలకు చిన్నచూపు ఉండేది. ఇక్కడ వచ్చేవన్నీ మసాలా సినిమాలే అని.. కొత్తదనం ఉండదని అనేవాళ్లు. కానీ ఇప్పుడు కథ మారింది. సౌత్ సినిమాల్లో భారీతనం.. క్రియేటివిటీ చూసి బాలీవుడ్ ఫిలిం మేకర్స్ బెంబేలెత్తిపోతున్నారు. వాళ్లు ఇన్ఫీరియర్‌ గా ఫీలయ్యేలా చేస్తున్నారు మన డైరెక్టర్లు. ముఖ్యంగా మన దర్శక ధీరుడు రాజమౌళి ‘బాహుబలి’తో బాలీవుడ్ దర్శక నిర్మాతలకు పెద్ద పాఠాలే నేర్పాడు. కరణ్ జోహార్ లాంటి పెద్ద దర్శకుడు ‘బాహుబలి’ తమకు చెంపపెట్టు లాంటి సినిమా అని చెప్పడం విశేషం. ‘బాహుబలి’ రిలీజ్ టైంలో ఇంకా చాలామంది దీన్ని ఆకాశానికెత్తేశారు. బాలీవుడ్ ఫిలిం మేకర్లపై విమర్శలు చేశారు. అందులో లెజెండరీ డైరెక్టర్ శేఖర్ కపూర్ కూడా ఒకడు.

రాజమౌళిని చూసి బాలీవుడ్ డైరెక్టర్లు సిగ్గు పడాలని ఆయన పేర్కొనడం గమనార్హం. ఇప్పుడు మరోసారి ఆయన ఈ తరహాలోనే మాట్లాడారు. ఇటీవలే శంకర్ మూవీ ‘2.0’ రిలీజై హిందీలో భారీ వసూళ్లు రాబడుతున్న నేపథ్యంలో ఆయన స్పందించారు. దక్షిణాది దర్శకులు ఇంత భారీ సినిమాలు ఎలా తీయగలుగుతున్నారని ఆయన ప్రశ్నించాడు. ఇదే విషయంలో బాలీవుడ్ దర్శకులు విఫలమవుతున్నారన్నాడు. దీన్ని బట్టి చూస్తే దక్షిణాది దర్శకుల్లోనే ఎక్కువ ప్యాషన్ ఉన్న విషయం అర్థమవుతోందని ఆయన చెప్పారు. ఇటీవలే ఆమిర్ ఖాన్ తో యశ్ రాజ్ ఫిలిమ్స్ తీసిన భారీ చిత్రం ‘థగ్స్ ఆఫ్ హిందుస్థాన్’ దారుణ పరాజయం అందుకున్న నేపథ్యంలో మన రాజమౌళి - శంకర్‌ ల విలువ మరింత పెరిగింది. అక్కడి ఫిలిం మేకర్లు మరింత ఇన్ఫీరియర్‌గా ఫీలయ్యేలా చేస్తున్నారు మన దర్శకులు.