Begin typing your search above and press return to search.
'కళావతి' స్టెప్స్ తో మహేశ్ దుమ్మురేపేశారు: శేఖర్ మాస్టర్
By: Tupaki Desk | 18 April 2022 11:30 PM GMTనిన్నమొన్నటి వరకూ టాలీవుడ్ స్టార్ హీరోలకు డాన్స్ కంపోజ్ చేయాలంటే, కోలీవుడ్ నుంచి డాన్స్ మాస్టర్లు రావలసిందే. సుందరం మాస్టర్ .. ప్రభుదేవా .. లారెన్స్ .. ఇలా అక్కడివారి హవానే ఇక్కడ కొనసాగింది. అయితే పాటల ప్రోగ్రామ్స్ ద్వారా ఇండస్ట్రీకి చాలామంది సింగర్స్ పరిచయమైనట్టుగానే, డాన్స్ షోల వలన చాలామంది డాన్స్ మాస్టర్లు వెలుగులోకి వచ్చారు. అంతేకాదు తమిళ స్టార్ హీరోలు ఇక్కడి డాన్స్ మాస్టర్లను అక్కడికి పిలిపించుకునేలా చేశారు. అలాంటి డాన్స్ మాస్టర్లలో శేఖర్ మాస్టర్ పేరు ఎక్కువగా వినిపిస్తోంది.
శేఖర్ మాస్టర్ కి టాలెంట్ ఉంది .. దానిని రాణింపుకు తీసుకుని వచ్చే వినయవిధేయతలు ఉన్నాయి. మేకర్స్ తో పాటు హీరోలతోను మంచి పరిచయాలు ఉన్నాయి. తమకి ఫలానా సాంగ్ శేఖర్ మాస్టర్ చేసి పెట్టాలని కోరే హీరోలు ఉన్నారు. ఆయన పేరును సిఫార్స్ చేసే హీరోలు ఉన్నారు. ఇక హీరోల బాడీ లాంగ్వేజ్ ను దృష్టిలో పెట్టుకుని, డాన్సులు కంపోజ్ చేయడంలో శేఖర్ మాస్టర్ సిద్ధహస్తుడు. తనకి వచ్చిన ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకుని, ఆ పాటపై తనదైన ముద్ర వేయడానికి ఆయన ఎంతగానో కష్టపడతాడు.
ఇటీవల 'సర్కారువారి పాట' నుంచి వచ్చిన ' కళావతి' సాంగ్ వ్యూస్ పరంగా .. లైక్స్ పరంగా కొత్త రికార్డులను కొల్లగొట్టిన సంగతి తెలిసిందే. ఈ పాటలోని సిగ్నేచర్ స్టెప్ ను ఎంతమంది ఏ స్థాయిలో రీల్స్ చేశారనేది ప్రత్యేకంగా చెప్పుకోవలసిన పనిలేదు. ఎక్కడ చూసినా ఇప్పుడు ఈ పాటనే మ్రోగుతోంది. తాజా ఇంటర్వ్యూలో ఈ పాటకి తాను కంపోజ్ చేసిన సాంగ్ ను గురించి శేఖర్ మాస్టర్ ప్రస్తావించాడు. "మహేశ్ బాబుకి నేను చేసిన ఫస్టు సాంగ్ 'సరిలేరు నీకెవ్వరు'లోని మైండ్ బ్లాక్ సాంగ్.
ఆ తరువాత మహేశ్ బాబు చేసిన సినిమా 'సర్కారువారి పాట'నే. ఈ సినిమాలో కూడా మహేశ్ నాకు ఒక ఛాన్స్ ఇవ్వొచ్చని అనుకున్నాను. అనుకున్నట్టే ఆయన ' కళావతి' సాంగ్ ఇచ్చారు. మహేశ్ బాబుగారితో స్టైలీష్ గా .. క్యూట్ గా .. అందంగా చేయించాలనే సెన్స్ తో ఆ డాన్స్ ను కంపోజ్ చేయడం జరిగింది. మహేశ్ బాబుగారు చాలా అందంగా చేయడంతో ఈ సాంగ్ ఎక్కడికో వెళ్లిపోయింది. 'పెన్నీ' సాంగ్ కూడా నేనే చేశాను .. మరో సాంగ్ చేయబోతున్నాను" అని చెప్పుకొచ్చాడు. 'పెన్నీ' సాంగ్ కూడా బాగా పాప్యులర్ అయిన సంగతి తెలిసిందే. ఇక మరో సాంగ్ ఏ స్థాయి సంచలనానికి తెరతీస్తుందో చూడాలి.