Begin typing your search above and press return to search.
సాయిపల్లవికి డాన్స్ కంపోజ్ చేయడం సాహసమే: శేఖర్ మాస్టర్
By: Tupaki Desk | 2 March 2021 9:30 AM GMTశేఖర్ కమ్ముల - సాయిపల్లవి కాంబినేషన్లో ఇంతకుముందు వచ్చిన 'ఫిదా' సినిమాలోని 'వచ్చిందే .. ' సాంగ్ ఎంతగా పాపులర్ అయిందో, ఇప్పుడు అంతకంటే వేగంగా 'సారంగధరియా.. 'పాట దూసుకుపోతోంది. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన 'లవ్ స్టోరీ' సినిమాలోని పాట ఇది. నాగచైతన్య - సాయిపల్లవి జంటగా నటించిన ఈ సినిమాకి పవన్ సీహెచ్ సంగీతాన్ని సమకూర్చాడు. రీసెంట్ గా వదిలిన 'సారంగధరియా' .. పాట కుర్రకారును హుషారెత్తిస్తోంది. ఇక ప్రతి వేదికపై ఈ సాంగ్ సందడి చేయడం ఖాయమని అనిపిస్తోంది.
ఈ పాటకి వస్తున్న రెస్పాన్స్ ను గురించి తాజా ఇంటర్వ్యూలో శేఖర్ మాస్టర్ ప్రస్తావించాడు. "సాధారణంగా ఏ పాటైనా జనంలోకి వెళ్లడానికి కొంత సమయం పడుతుంది. అలాంటిది ఈ సినిమాలోని ఈ పాట 24 గంటల్లోనే రికార్డుస్థాయిలో వ్యూస్ ను రాబడుతుండటం నిజంగా విశేషమే. సాయిపల్లవి డాన్స్ లో ఏదో తెలియని మేజిక్ ఉంటుంది. డాన్స్ చేసేటప్పుడు కూడా ఆమె ఎక్స్ ప్రెషన్స్ చాలా క్యూట్ గా ఉంటాయి. ఆమె బాడీ లాంగ్వేజ్ కూడా చాలా బాగుంటుంది. సాయిపల్లవికి నేను చేసిన మూడోపాట ఇది. ఇంతకుముందు చేసిన 'వచ్చిందే .. ' .. 'ఏవండోయ్ నానిగారూ .. ' మంచి పేరు తెచ్చిపెట్టాయి.
సాయిపల్లవికి 'ఫిదా' పాట చేసేటప్పుడు నేను పెద్దగా టెన్షన్ పడలేదు. ఆ తరువాత ఆమె హీరోయిన్ గా .. డాన్సర్ గా మంచి పేరు తెచ్చుకుంది. ఆమె మంచి క్లాసికల్ డాన్సర్ .. అదే స్థాయిలో జానపద నాట్యంపై పట్టుంది. అందువలన ఆమె పాటను కంపోజ్ చేయడం అంతతేలికైన పనేం కాదు. ఒక్క మూమెంట్ విషయంలో కూడా ఆమె రాజీపడదు. పెర్ఫెక్షన్ కోసం ఎన్నిసార్లయినా కష్టపడుతుంది. అలాంటి హార్డ్ వర్కర్ ను నేను చూడలేదు. ఈ సాంగ్ కి సంబంధించిన క్రెడిట్ అంతా కూడా సాయిపల్లవికే చెందుతుంది. ఆమె డాన్స్ చేస్తుంటే నెమలి నాట్యం చేస్తున్నట్టుగా అనిపిస్తుంది" అని చెప్పుకొచ్చాడు.