Begin typing your search above and press return to search.
#ధర్మపురి.. అమ్మాయి - అబ్బాయి ప్రేమకథలో ట్విస్టేంటో?
By: Tupaki Desk | 11 Oct 2021 11:07 AM ISTజగిత్యాల జిల్లా ధర్మపురి నేపథ్యంలో తెరకెక్కిన తొలి తెలుగు చిత్రాలలో ఒకటైన ధర్మపురి ఫస్ట్ లుక్ పోస్టర్ తాజాగా విడుదలైంది. ఇందులో ప్రధాన జంట గగన్ విహారి -అపర్ణా దేవి లుక్ ని ఆవిష్కరించారు.
తెలంగాణ గ్రామీణ సౌందర్యం నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రంలో లీడ్ పెయిర్ ప్రేమికులుగా కనిపిస్తారు. 90ల నాటి ధర్మపురి బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ చిత్రం రియలిస్టిక్ లవ్ డ్రామా అని ప్రచారం జరుగుతోంది. ఇది డోరా సంస్కృతి.. అణచివేత వంటి సున్నితమైన అంశాలను ప్రధానంగా ఆవిష్కరించనుంది. ప్రేమకథలో థ్రిల్ ఎలిమెంట్స్ తో సినిమా తెరకెక్కిందని పోస్టర్ వెల్లడిస్తోంది.
ధర్మపురి నేపథ్యం అనగానే తెలంగాణ గ్రామీణ సెటప్ అన్నది స్పష్ఠంగా ఉంది. ఇది ఎగ్జయిట్ చేసే ఎలిమెంట్ కానుంది. నైజాం యాస ఆకట్టుకుంటుంది. ఈ చిత్రానికి విశ్వజగత్ దర్శకుడు. భాస్కర్ యాదవ్ దాసరి నిర్మించారు. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. త్వరలో విడుదల తేదీ ప్రకటించనున్నారు.