Begin typing your search above and press return to search.
వాడుకున్నందుకు 70కోట్లు కట్టండి: స్టార్ హీరోయిన్
By: Tupaki Desk | 19 April 2020 4:53 AM GMTసెలెనా గోమెజ్.. పలు సూపర్ హిట్ ఆల్బమ్స్ ద్వారా పాపులర్ అయిన ప్రఖ్యాత గాయనీ.. ఈమె హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి ఇప్పుడు హాలీవుడ్ లో హాట్ అందెగత్తెగా పేరు తెచ్చుకుంది. ఈమెతో యాడ్స్ చేయడానికి క్యూ కడుతుంటారు. కోట్లు కుమ్మరిస్తారు.
అలాంటి సెలెనా గోమెజ్ ను అనుమతి లేకుండా ఆమె మొఖాన్ని వాడి ఓ మొబైల్ ఫ్యాషన్ గేమ్ సంస్థ గేమ్ ను తయారు చేసుకుంది. దీనిపై సీరియస్ అయిన సెలెనా ఏకంగా ఆ గేమ్ సంస్థపై భారీ మొత్తంలో దావా వేసింది. నష్టపరిహారంగా 10 మిలియన్ డాలర్లు (రూ.70కోట్లకుపైగా) చెల్లించాలని డిమాండ్ చేసింది.
తన పరువు తీసే విధంగా సదురు గేమ్ కంపెనీ ప్రవర్తించిందని.. అనుమతి లేకుండా తను వాడుకుందని సెలెనా ఆరోపించింది.
ఇప్పటికే తాను పలు పాపులర్ బ్రాండ్స్ కోసం ప్రచారం చేస్తున్నానని.. వారు కోట్లాది రూపాయలు చెల్లిస్తున్నారని.. అలాంటిది కనీసం అనుమతి లేకుండా తన రూపాన్ని పేరును వాడుకోవడం నేరమని సెలెనా పరువునష్టం పిటీషన్లో పేర్కొంది. అందుకే 10 మిలియన్ డాలర్ల నష్టపరిహారం చెల్లించాలని కోరింది.
కాగా హాలీవుడ్ లో ఇలా పర్మిషన్ లేకుండా సెలెబ్రెటీలను వాడుకుంటే నేరం. దీంతో ఈ దావాను సదురు గేమింగ్ కంపెనీ కట్టకతప్పదని హాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.