Begin typing your search above and press return to search.

ఈ టైం లో సెల్ఫీ.. వాళ్లని ఏమనాలో..!

By:  Tupaki Desk   |   17 Nov 2022 6:41 AM GMT
ఈ టైం లో సెల్ఫీ.. వాళ్లని ఏమనాలో..!
X
సెలబ్రిటీస్ అయినంత మాత్రాన వారికి ఎమోషన్స్ ఉండవా ఇంట్లో మనిషి మరణించి శోక సముద్రంలో ఉన్న టైం లో వారిని ఇబ్బంది పెట్టేలా చేయడం ఎంతవరకు సమంజసం. కృష్ణ మరణంతో తెలుగు సినీ పరిశ్రమ మొత్తం విషాద ఛాయలు కమ్ముకున్నాయి. కృష్ణ గారికి నివాళి సమర్పించేందుకు సెలబ్రిటీస్ అంతా కూడా నానక్ రాంగూడ కృష్ణ గారికి ఇంటికి వచ్చారు. సెలబ్రిటీస్ అంతా కూడా ఒక చోట కనిపించడంతో అక్కడ జరిగే కార్యక్రమం ఏంటన్నది ఆలోచన కూడా లేకుండా కొందరు సెల్ఫీల కోసం ప్రయత్నించారు.

వాళ్లెంత సెలబ్రిటీస్ అయినా కూడా వారికి ఎమోషన్స్ ఉంటాయి కదా.. ఓ పక్క పరిశ్రమ పెద్ద దిక్కుని కోల్పోయిందని బాధపడుతున్న టైం లో సెల్ఫీ అంటూ కృష్ణ ఇంటి వద్ద, పద్మాలయ స్టూడియోస్ వద్ద కొందరు అడగడం అందరిని ఆశ్చర్య పరిచింది. సెలబ్రిటీ తో సెల్ఫీ అనేది ఒక క్రేజీ థింగ్ కానీ వారు ఉన్న పరిస్థితి ఏంటి అన్నది ఆలోచించాలి. వారి ఎక్కడ కనబడితే అక్కడ సెల్ఫీలు అడగడం అన్నది కచ్చితంగా ఖండించాల్సిన విషయం.

ఓ పక్క తండ్రిని కోల్పోయిన బాధలో ఉన్న మహేష్ కి కూడా ఈ సెల్ఫీల గోల తప్పలేదని తెలుస్తుంది. ప్రతిదానికి ఒక సమయం సందర్భం అనేది ఉంటుంది. సెలబ్రిటీస్ ఎమోషన్స్ ని లెక్క చేయకుండా ఇలాంటి టైం లో విచక్షణారహితంగా వారి కనిపించగానే సెల్ఫీలు అడగడం..

దిగడం లాంటిది సంస్కార హీనులు చేసే పని. నందమూరి హరికృష్ణ రోడ్ యాక్సిడెంట్ టైం లో కూడా హాస్పిటల్ బెడ్ మీద ఉన్న ఆయన భౌతికకాయం తో సెల్ఫీలు దిగారు ఆ హాస్పిటల్ లోని స్టాఫ్. సెలబ్రిటీలు అయినంత మాత్రాన వారికి వ్యక్తిగత స్వేచ్చ ఉండగా.. కనీసం సెల్ఫీ అడిగే.. లేదా తీసుకునే సందర్భం ఉంటుంది కదా.. అలా కాకుండా వారు కనిపిస్తే సెల్ఫీ దిగడం అనేది ఎంతవరకు కరెక్ట్ అన్నది ఆలోచించాలి.

అందుకే ఇలా చేసే వారికి బాలయ్య కరెక్ట్.. సెల్ఫీ అని ఎవరైనా దగ్గరకు వస్తే ఫోన్ తీసుకుని విసిరేయడమే బెటర్. సెలబ్రిటీస్ ఎమోషన్స్ ని అర్ధం చేసుకోలేని వారు నిజమైన అభిమానులు కారు. సెల్ఫీ అడిగే సమయం.. సందర్భం ఉంటుంది ఆ టైం లో వారు ఇవ్వకపోతే మాత్రం వారిని తప్పుపట్టాల్సి ఉంటుంది కానీ ఇలా వారు బాధతో ఉన్న టైం లో సెల్ఫీలు అడిగి ఇబ్బంది పెట్టడం ఏమాత్రం కరెక్ట్ కాదు. అభిమానులు ఈ విషయాన్ని అర్థం చేసుకోవాల్సిందే.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.