Begin typing your search above and press return to search.
సెల్ఫీ రాజా బాగానే పట్టుకొచ్చాడు
By: Tupaki Desk | 16 July 2016 9:21 AM GMTఅల్లరి నరేష్ కెరీర్లోనే అత్యధిక థియేటర్లలో రిలీజైంది ‘సెల్ఫీ రాజా’. అతడి కెరీర్లో తొలి రోజు అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగానూ ఇది రికార్డు సృష్టించినట్లు చెబుతున్నాడు నిర్మాత రామబ్రహ్మం చౌదరి. ఈ సినిమా తొలి రోజు రూ.1.76 కోట్ల షేర్ వసూలు చేసిందట. అల్లరోడికి ఇది చాలా పెద్ద ఫిగరే. వరుస ఫ్లాపులతో డీలా పడ్డ సమయంలో ఈ ఆరంభ వసూళ్లు అల్లరోడికి ఉత్సాహాన్నిచ్చేవే. నరేష్ గత సినిమాలు జంప్ జిలాని.. మామ మంచు అల్లుడు కంచు.. దారుణమైన ఓపెనింగ్స్ తెచ్చుకున్నాయి. ఐతే ‘సెల్ఫీ రాజా’ను బాగా ప్రమోట్ చేయడంతో ఈ సినిమా మీద జనాల్లో బాగానే ఆసక్తి మొదలైంది. ప్రస్తుతం థియేటర్లలో సరైన సినిమాలు లేకపోవడం.. పెద్ద పోటీ లేకుండా రిలీజ్ చేయడం ‘సెల్ఫీ రాజా’కు కలిసొచ్చింది.
ఐతే ‘సెల్ఫీ రాజా’కు టాక్ మాత్రం అంత పాజిటివ్ గా లేదు. రొటీన్ కంటెంట్.. అల్లరి నరేష్ సినిమాల్లో ఎప్పుడూ కనిపించే పేరడీలు.. స్పూఫులతోనే సినిమాను నింపేయడంతో ప్రేక్షకులు పెదవి విరుస్తున్నారు. ఐతే ఈ పేరడీల్ని ఎంజాయ్ చేసేవాళ్లు చేస్తున్నారు. ఇంతకుముందు నరేష్ సినిమా ‘సిద్ధు ఫ్రమ్ శ్రీకాకుళం’తో దర్శకుడిగా పరిచయమైన ఈశ్వర్ రెడ్డే ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. నరేష్ సరసన సాక్షి చౌదరి.. కామ్న సింగ్ కథానాయికలుగా నటించారు. వచ్చే వారం ‘కబాలి’ విడుదలయ్యే వరకు ‘సెల్ఫీ రాజా’కు టైముంది. బడ్జెట్ తక్కువ కావడం ఈ సినిమాకు కలిసొచ్చే అంశం. మరి సెల్ఫీ రాజా డివైడ్ టాక్ ను తట్టుకుని వారం రోజుల్లో బయ్యర్లను సేఫ్ చేసేస్తాడేమో చూడాలి.