Begin typing your search above and press return to search.
అక్కడికి వస్తే బన్నీతో సెల్ఫీ చాలా వీజీ!
By: Tupaki Desk | 16 Nov 2021 9:00 AM GMTఅంతర్జాతీయ ప్రమాణాలతో ఏషియన్ సినిమాస్ తో కలిసి సూపర్ స్టార్ మహేష్ నిర్మించిన ఏఏంబీ మాల్ (ఏఎంబీ సినిమాస్) స్పెషాలిటీ గురించి తెలిసిందే. అధునాతన సాంకేతికతతో జంట నగరాల్లోనే ది బెస్ట్ మాల్ గా ఏఎంబీ ఎంతో లగ్జరీయస్ గా రూపుదిద్దుకుంది. అయితే ఇప్పుడు ఏఎంబీకి పోటీగా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అమీర్ పేటలో మరో మాల్ కమ్ మల్టీప్లెక్స్ నిర్మాణం చేపడుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ మల్టీప్లెక్స్ పనులు వేగంగా జరుగుతున్నాయి. అయితే ఎఎంబీని మించి ఈ మాల్ డిజైన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా పిలల్ని..ఎంటర్ టైన్ మెంట్ ప్రియుల్ని ప్రత్యేకంగా ఆకట్టుకునేలా ఎంతో ఆకర్షణీయంగా అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మాణం చేపడుతున్నారుట.
ఈ నేపథ్యంలో కొన్ని ఫీచర్స్ గురించి వివరాలు బయటకు వచ్చాయి. మల్టీప్లెక్స్ వెలుపల లార్జ్ డిజిటల్ ఎల్ ఈడీ స్క్రీన్ మీద బన్ని విజువల్ ఒకటి హైలైట్ గా కనిపించనుందిట. అంటే బన్నీ తో ఫోటో దిగాలనుకునే వారు ఆ విజువల్ ముందుకు వెళ్లి నిలబడితే చాలు ఆటోమేటిక్ గా సెన్సార్ సహకారంతో బన్నీ పక్కన నుంచున్న వారి ఎత్తును బట్టి ఆ హైట్ లోకి మారిపోతుంది. చిన్న పిల్లలు ఉంటే ఆ సైజులోకి..పెద్దవారు అయితే వారి హైట్ కి బ్యాలెన్స్ అయ్యేలా విజువల్ అలా మూవ్ అవుతుందిట.అలాగే అక్కడ నుంచున్న వారు ఎలా మాట్లాడితే అలా ఈ డిజిటల్ వర్చువల్ ఆర్ట్ మాట్లాడుతుందిట. అందుకోసం ఏకంగా రెండు కోట్లను ఆ ఒక్క ఫీచర్ కే బన్నీ- ఏషియన్ బృందం ఖర్చు చేస్తున్న్లట్లు సమాచారం.
దానికి సంబంధించి ఓ పెద్ద కంపెనీతో డిస్కషన్స్ జరుగుతున్నాయట. ఐడియా వర్కవుట్ అయితే అది జనాకర్షణ పెంచేందుకు ఉపకరిస్తుంది. బన్ని అభిమానులు ఫోటోలు..సెల్పీలు దిగడానికి ఈ విజువల్ వండర్ అద్భుతంగా ఉంటుంది. మాల్ విజిటింగ్ కి వచ్చిన వారికి..షాపింగ్ చేయడానికి వచ్చిన వారికి బన్నీతో కలిసి ఫోటో దిగే అవకాశం సులువుగా కలుగుతుంది. అయితే అందుకోసం రెండు కొట్లు వెచ్చిస్తున్నారు కాబట్టి దానికి టిక్కెట్ ధర ఉంటుందా.. రేటు ఏమైనా నిర్ధారిస్తారా? ఉచితంగానే కుదురుతుందా? అన్నది తేలాల్సి ఉంది. ప్రస్తుతం బన్నీ `పుష్ప` షూటింగ్ లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.