Begin typing your search above and press return to search.

ఆ సినిమాను ఆర్యతో పోల్చుతున్నారే..!

By:  Tupaki Desk   |   6 May 2023 3:57 PM GMT
ఆ సినిమాను ఆర్యతో పోల్చుతున్నారే..!
X
అల్లు అర్జున్ కెరీర్ లో ఆర్య సినిమాకు ప్రత్యేక స్థానం ఉంటుందని చెప్పొచ్చు. సుకుమార్ మొదటి సినిమా.. అల్లు అర్జున్ కి సెకండ్ సినిమా.. కానీ బన్నీని హీరోగా ప్రేక్షకులకు దగ్గర వేసింది మాత్రం ఈ సినిమానే అని చెప్పొచ్చు. ఆర్య తర్వాత అల్లు అర్జున్ కి ఒక క్రేజ్ ఏర్పడింది. ఆర్య సినిమా దిల్ రాజు నిర్మించారు. అయితే అల్లు అర్జున్ సెకండ్ సినిమా ఎలాగైతే ఆర్య వచ్చిందో అలానే తన ఫ్యామిలీ హీరో ఆశిష్ సెకండ్ సినిమా కూడా అలానే ప్లాన్ చేశారు దిల్ రాజు.

ఆశిష్ హీరోగా మొదటి సినిమా రౌడీ బాయ్స్ వచ్చింది. ఆ సినిమా ఏదో అలా అలా ఆడింది. ఇక ఆ హీరో సెకండ్ సినిమా సెల్ఫిష్ ప్రచార చిత్రాలు బయటకు వచ్చాయి. సెల్ఫిష్ సినిమాను దిల్ రాజు ఆర్య తరహాలో తెరకెక్కించారని తెలుస్తుంది.

అల్లు అర్జున్ ఆర్య టైం లో ఎలాగైతే ఆడియన్స్ కు దగ్గరయ్యాడో సెల్ఫిష్ తో ఆశిష్ కూడా ప్రేక్షకులకు దగ్గరవ్వాలని చూస్తున్నాడు. దిల్ రాజు మెగా ప్లాన్స్ ఎప్పుడూ ఫెయిల్ అవలేదు.

కాబట్టి సెల్ఫిష్ సినిమా విషయంలో కూడా అది వర్క్ అవుట్ అయ్యే ఛాన్స్ ఉంది. సెల్ఫిష్ సినిమాలో లవ్ టుడే హీరోయిన్ ఇవనా హీరోయిన్ గా నటిస్తుంది. విశాల్ కాశి డైరెక్ట్ చేసిన ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

ఈమధ్య హీరో క్యారెక్టరైజేషన్ ల మీదే సినిమా కథలు వస్తున్నాయి. మరి ఈ సెల్ఫిష్ కథ ఎలా ఉంటుందో చూడాలి. దిల్ రాజు మాత్రం ఈ సినిమాకు ఆశిష్ కి మరో ఆర్య సినిమాలా ప్రమోట్ చేస్తున్నారు.

బయటకు చెప్పట్లేదు కానీ దాదాపు ఆర్య సినిమా తరహాలోనే సెల్ఫిష్ స్ట్రాటజీ ఉంటుందని. అది వర్క్ అవుట్ అయితే సినిమా సూపర్ హిట్ పక్కా అని అంటున్నారు. సెల్ఫిష్ కోసం ఆశిష్ తన స్టైల్ మొత్తం మార్చేశాడు. చూస్తుంటే హీరోగా నిలబడేలానే ఉన్నాడు.