Begin typing your search above and press return to search.
ఆ సీక్వెల్ అంటే భయపడుతున్న నిర్మాతలు!
By: Tupaki Desk | 28 May 2020 8:50 AM GMTకోలీవుడ్ స్టార్ హీరో సూర్య తమ్ముడు కార్తీ తమిళవాళ్లకే కాదు తెలుగు వాళ్లకి కూడా బాగా పరిచయం. అతను తమిళంలో చేసిన ప్రతి సినిమా తెలుగులో కూడా రిలీజ్ అవుతుంటాయి. తెలుగులో తన సినిమా విడుదల ఉన్నప్పుడల్లా ఇక్కడకు వచ్చి ఇంటర్వ్యూలు కూడా ఇస్తుంటాడు. అయితే కార్తీ ఇప్పుడు తన హిట్ సినిమాల్లో ఒక్క సినిమాని సీక్వెల్స్ చేయనున్నాడు అని వార్తలు వస్తున్నాయి. హిట్ సినిమాలకి సీక్వెల్స్ రావడం చాలాకాలం నుంచి జరుగుతున్నదే. ఈ నేపధ్యంలో డైరెక్టర్ సెల్వ రాఘవన్ తో కార్తీ ఓ సీక్వెల్ కి ప్లాన్ చేస్తున్నాడు. గతంలో సెల్వ రాఘవన్ డైరెక్షన్ లో వచ్చిన ‘యుగానికి ఒక్కడు’ కోలీవుడ్, టాలీవుడ్ లో ప్రత్యేకమైన స్థానంలో నిలిచింది.
కార్తీ కెరీర్ ప్రారంభంలో వచ్చిన ఈ ప్రయోగాత్మక చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకుంది. అయితే ఇప్పుడు ఆ సినిమాను సీక్వెల్ చేస్తే బాగుంటది అని ఆలోచన చేశారట సెల్వ రాఘవన్. యుగానికి ఒక్కడు సినిమాలో చోళులు, పాండ్యులకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్స్ ఒక కొత్త ఫీల్ ని కలిగిస్తాయి. ఒక్కో సమస్యను దాటుకుంటూ వెళ్లడం సినిమాలో హైలెట్ పాయింట్స్. చెప్పాలంటే అప్పట్లో ఈ సినిమా సౌత్ లో వచ్చిన బిగ్గెస్ట్ అడ్వెంచర్ మూవీ. దర్శకుడు సెల్వా రాఘవన్ 7/జి బృందావన కాలనీ సినిమా తరువాత తెలుగులో చేసిన ఆడవారి మాటలకు అర్దాలే వేరులే సినిమా కూడా సక్సెస్ కావడంతో తెలుగులో శ్రీ రాఘవ అని ఒక నేమ్ సెట్ చేసుకున్నాడు.
దీంతో తెలుగులో యుగానికి ఒక్కడు సినిమా రిలీజ్ అవ్వగానే సాలీడ్ ఓపెనింగ్స్ ని అందుకుంది. హిస్టారికల్ మూవీ అంటూ పాజిటివ్ కామెంట్స్ రావడంతో 2010లో బెస్ట్ హిట్స్ లో ఈ సినిమా కూడా స్థానం సంపాదించుకుంది. కార్తీకి కూడా స్టార్డం ఉంది కాబట్టి ఈ సీక్వెల్ ప్లాన్ చేస్తున్నాడు. చోళరాజుల నేపథ్యంలో సాగే కథను మరోమారు రూపొందించాలనే ఆసక్తి తనలో అలాగే ఉందంటూ ట్విట్టర్ ద్వారా తెలియజేశాడు సెల్వరాఘవన్. ముఖ్యంగా ఈ మధ్య వర్ణ, ఎన్జికె అనే బిగ్ బడ్జెట్ మూవీస్ తీసి కోట్ల నష్టాన్ని చూడాల్సి వచ్చింది. దీంతో ఇప్పుడు యుగానికి ఒక్కడు2 కోసం 150 కోట్లయినా ఖర్చు అవుతుందని అంచనా వేస్తున్నారు. కానీ నిర్మాతలంతా ఆ సెల్వ రాఘవన్ గత సినిమాల రిజల్ట్స్ చూసి వెనక్కి తగ్గుతున్నట్లు సమాచారం.