Begin typing your search above and press return to search.
సెల్వ రాఘవన్ పిచ్చెక్కించేలా ఉన్నాడే..
By: Tupaki Desk | 20 Jun 2017 7:17 AM GMTతమిళంలో చిత్ర విచిత్రమైన సినిమాలు తీసే దర్శకుల్లో సెల్వ రాఘవన్ ఒకడు. అతను తీసే కొన్ని సినిమాలు అద్భుతంగా అనిపిస్తాయి. కొన్ని సినిమాలు మాత్రం పిచ్చెక్కించేస్తాయి. 7/జి బృందావన కాలనీ.. ఆడువారి మాటలకు అర్థాలే వేరులే సినిమాలు ఎంత మంచి ఫీలింగ్ ఇస్తాయో.. ‘వర్ణ’ లాంటి సినిమాలు అంత పిచ్చి పిచ్చిగా అనిపిస్తాయి. ‘వర్ణ’ తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న ఈ దర్శకుడు.. తాజాగా ‘నెంజమ్ మరప్పుదిల్లై’ అనే వెరైటీ హార్రర్ థ్రిల్లర్ తీశాడు. డైరెక్టర్ టర్న్డ్ యాక్టర్ ఎస్.జె.సూర్య కథానాయకుడిగా నటించిన సినిమా ఇది. రెజీనా కసాండ్రాతో పాటు ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ ఫేమ్ నందిత శ్వేత కథానాయికలుగా నటించారు.
‘నెంజమ్ మరప్పుదిల్లై’కి సంబంధించి ఇంతకుముందు రిలీజ్ చేసిన టీజర్ కానీ.. ట్రైలర్ కానీ.. జనాలకు ఏమీ అర్థం కాలేదు. ఇది అదో రకం సినిమాలా కనిపించింది. సినిమా చాలా గొప్పగానో.. చాలా చెత్తగానో ఉండేలా కనిపించింది ప్రోమోస్ చూస్తే. చాన్నాళ్లుగా రిలీజ్ కోసం ఎదురు చూస్తున్న ఈ సినిమాను ఎట్టకేలకు జూన్ 30న రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా లేటెస్టుగా ఒక ట్రైలర్ వదిలాడు సెల్వరాఘవన్. తొలి ట్రైలర్ తో పోలిస్తే ఇదేం భిన్నంగా లేదు. ఈ ట్రైలర్ చూసినా.. సినిమా ఏంటో ఎలా ఉంటుందో ఒక్క ముక్కా అర్థం కావడం లేదు. లీడ్ క్యారెక్టర్లను చాలా వైవిధ్యంగా చూపించాడు సెల్వ. రెజీనా ఏదో ప్రార్థన చేస్తున్నట్లు చూపించడం.. ఎస్.జె.సూర్య గదిలోకి వెళ్లడం.. ఒక వెరైటీ లుక్ తో గిటార్ పట్టుకుని బయటికి రావడం.. ఆపై నందిత డ్రగ్స్ తీసుకుంటున్నట్లుగా చూపించడం.. అంతా కూడా అదో రకంగా అనిపిస్తోంది. ‘‘దయ్యానికి అన్నీ తెలుసు.. ఒక్క ముగింపు తప్ప’’.. ‘‘దేవుడికి ముగింపు మాత్రమే తెలుసు’’.. అంటూ రెండు క్యాప్షన్స్ వేశాడు సెల్వ. వాటితో ఏం చెప్పదలుచుకున్నాడో మరి. సినిమా వెరైటీగా ఉంటుందని అర్థమవుతోంది కానీ.. జనాలకు థియేటర్లలో పరీక్ష పెట్టి పిచ్చెక్కించేస్తుందేమో అన్న సందేహాలు కూడా కలుగుతున్నాయి. తమిళంలో మంచి రెస్పాన్స్ వస్తే ఈ చిత్రాన్ని తెలుగులోనూ విడుదల చేయాలనుకుంటున్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/