Begin typing your search above and press return to search.
హీరోయిన్ని ఏడిపించేసిన డైరెక్టర్
By: Tupaki Desk | 13 Oct 2015 7:05 AM GMTడైరెక్టరో.. ప్రొడ్యూసరో.. హీరోయిన్ని తిట్టారని, కొట్టారని వార్తలు వింటుంటాం. మన తెలుగు పరిశ్రమలో ఇలాంటి ఘటనలు చాలానే ఉన్నాయి. తాజాగా తమిళ పరిశ్రమలో ఇలాంటి ఘటన ఒకటి జరిగిందట. ఓ స్టార్ డైరెక్టర్.. హీరోయిన్ని అందరి ముందు తిట్టడంతో ఆమె కన్నీళ్లు పెట్టుకుని నానా యాగీ చేసిందట. ఐతే ఆ హీరోయిన్ తండ్రి ప్రమేయంతో గొడవ సద్దుమణిగి.. అంతా మామూలైపోయింది. ఇంతకీ ఆ డైరెక్టర్.. హీరోయిన్ ఎవరు? ఏంటా కథ? తెలుసుకుందాం పదండి.
‘7/జి బృందావన కాలనీ’, ‘ఆడువారి మాటలకు అర్థాలే’ లాంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు చేరువైన దర్శకుడు సెల్వ రాఘవన్. అతడి భార్య ‘మాలై నేరత్తు మయకం’ అనే సినిమాతో దర్శకురాలిగా పరిచయమవుతోంది. ఇది సెల్వ రాసిన కథే. దీన్ని సెల్వనే తీయాలనుకున్నాడు కానీ కుదర్లేదు. చివరికి ఆ కథను గీతాంజలి చేతికిచ్చాడు. ఈ సినిమాలో ఎడిటర్ కోలా భాస్కర్ తనయుడు కోలా బాలకృష్ణ హీరోగా నటిస్తున్నాడు. వామిఖా అనే కొత్తమ్మాయి హీరోయిన్ గా చేస్తోంది.
ఐతే భార్యకు కొత్త కాబట్టి తొలిరోజు సెల్వనే డైరెక్ట్ చేశాడు. ఆ సందర్భంగా హీరోయిన్ వామిఖ సెల్వ చెప్పినట్లు చేయలేకపోయిందట. దీంతో ఓ దశలో సహనం కోల్పోయి అరిచేశాడట సెల్వ. దీంతో ఆమె గట్టిగా ఏడుస్తూ అక్కణ్నుంచి వెళ్లిపోయిందట. తర్వాత తన తండ్రికి ఫోన్ చేసి.. తానీ సినిమా చేయనని ఏడ్చిందట. ఐతే ఆమె తండ్రి ఎమోషనల్ అయిపోకుండా కూల్ గా.. ఇలాంటివి సహజం, స్పోర్టివ్ స్పిరిట్ తో తీసుకో అని ఆమెకు సలహా ఇచ్చాడట. వెంటనే కన్నీళ్లు తుడుచుకుని షూటింగుకి వచ్చేసిందట వామిఖ. ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతున్న నేపథ్యంలో ఓ టీవీ ఛానెల్ కు ఇంటర్వ్యూ ఇస్తూ ఈ విషయాన్ని వెల్లడించింది వామిఖ.