Begin typing your search above and press return to search.

అక్కడి స్టార్లకు ఇదేం పిచ్చో...

By:  Tupaki Desk   |   28 Sept 2016 9:00 PM IST
అక్కడి స్టార్లకు ఇదేం పిచ్చో...
X
మన దగ్గర స్టార్ హీరోలు నేరుగా సినిమా నిర్మాణంలో చేతులు పెట్టడమే తక్కువ. ఒకవేళ నిర్మాతలుగా కార్డ్ పడినా.. ఓ ఏరియాకి రైట్స్ తీసుకుని రెమ్యూనరేషన్ తగ్గించుకుని చేయడమే తప్ప.. చేతిలో డబ్బులు ఖర్చు చేసి సినిమాలు తీసిన దాఖలాలు ఉండవు. ఈ స్టేట్ మెంట్ కి మంచు ఫ్యామిలీ ఒక్కటీ మినహాయింపు లెండి. అయితే.. తమిళ్ లో మాత్రం ఓ స్టార్ నటిస్తుంటే.. మరో స్టార్ హీరో నిర్మించేందుకు ముందుకు వస్తుండడం ఆశ్చర్యం కలిగిస్తోంది.

రజినీ అల్లుడు కం స్టార్ హీరో అయిన ధనుష్.. నిర్మాతగా కూడా సక్సెస్ అయ్యాడు. మంచి టేస్ట్ ఉన్న ప్రొడ్యూసర్ అనిపించేసుకున్నాడు కూడా. కానీ ఇప్పటివరకూ ధనుష్ నిర్మించినవి లోబడ్జెట్ సినిమాలు కాగా.. ఇప్పుడు ఇలయదళపతి విజయ్ ని హీరోగా పెట్టి సినిమా తీస్తుండడం విశేషం. ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం ఇంకోటి ఏంటంటే.. ధనుష్ కి బ్రదర్ అయిన సెల్వ రాఘవన్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేయనున్నాడట. ఇప్పటికే ఇద్దరు స్టార్లు ఈ ప్రాజెక్టుపై మాట్లాడేసుకోవడమే కాదు.. ఓకే కూడా చెప్పేసుకున్నారని.. త్వరలో అనౌన్స్ మెంట్ కూడా చేయనున్నారని తెలుస్తోది.

విజయ్ తో మాత్రం ధనుష్ ఎలాంటి ప్రయోగాలు చేయకపోవడం విశేషం. కామెడీ ఎంటర్టెయిన్మెంట్ జోనర్ లో ఈ సినిమా తెరకెక్కనుండగా.. విజయ్ ను కొత్తగా ప్రెజెంట్ చేయనున్నాడట దర్శకుడు సెల్వరాఘవన్.