Begin typing your search above and press return to search.

పోర్న్‌ తర్వాత వాటిని బ్యాన్‌ చేస్తారా?

By:  Tupaki Desk   |   11 Aug 2015 11:02 PM GMT
పోర్న్‌ తర్వాత వాటిని బ్యాన్‌ చేస్తారా?
X
ఆన్‌ లైన్‌ లో న్యూడ్‌ వీడియోలు అందుబాటులోకి రావడం వల్ల పిల్లలు చెడిపోతున్నారన్నది నిజం. యువతరం పెడదోవ పట్టి దారుణాలకు ఒడికట్టడం ఈ వీడియోల వల్లే. మనదేశంలోని కల్చర్‌, సంప్రదాయం వీటికి ఏమాత్రం సపోర్టివ్‌ కాదు. అందుకే భారతదేశంలో పోర్న్‌ వెబ్‌ సైట్ల ను నిషేధించింది మోడీ ప్రభుత్వం. అయితే మంచిపై చెడు గెలుపు అన్న చందంగా రెండో రోజే ప్రభుత్వం కొంత వెనక్కి తగ్గి కొన్ని సైట్ల కు బ్యాన్‌ లేదని ప్రకటించాల్సొచ్చింది.

కారణం ఏదైనా పోర్న్‌ ప్రభుత్వాన్నే గెలిచిందని చెప్పుకోవచ్చు. అయితే ఇకమీదట ప్రభుత్వాల యుద్ధం సినిమాల్లోని న్యూడ్‌ పైకి మళ్లిస్తే బెటర్‌ గా ఉంటుందేమోనని అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. బాలీవుడ్‌ లో హాలీవుడ్‌ కల్చర్‌ రాజ్యమేలుతోంది. బాలీవుడ్‌ సినిమాల్లో విచ్చలవిడి శృంగారం, ఐటెమ్‌ కల్చర్‌ విపరీతంగా ఉంది. దాన్ని మిగతా పరిశ్రమలు ఎడాప్ట్‌ చేసుకుంటున్నాయి. ఇటీవలి కాలంలో తెలుగు సినిమాల్లోనూ ఈ కల్చర్‌ పెచ్చు మీరిపోయింది. సెమీ న్యూడ్‌ సీన్స్‌తో సన్నివేశాలు, ఐటెమ్‌ పాటలు తెరకెక్కుతున్నాయి. అవంతిక న్యూడ్‌ బ్యాక్‌ నుండి, సమంత ఆలియా భట్‌ వంటి భామల బికినీల వరకు కాస్త రాంగ్‌ ప్రభావం చూపేవే అంటున్నారు ఫండమెంటలిస్టులు.

కిక్కు పేరుతో ఐటెమ్‌ గీతాలు, స్విమ్మింగ్‌ పూల్‌ సరసాలు మనవాళ్లు కూడా చూపించేస్తున్నారు. ఇది కూడా కట్టడి అవ్వాల్సిందేనని కొందరు సాంప్రదాయ వాదులు వాదిస్తున్నారు. ఇక సినిమాల్లో ఐటెమ్‌ లపై ప్రభుత్వం దృష్టి సారించాల్సిన సందర్భం వచ్చిందని వీరి ఫీలింగ్‌. చూద్దాం ఏమవుతుందో..