Begin typing your search above and press return to search.
తోటి నటులతో చలపతిరావు పరాచికాలు!
By: Tupaki Desk | 26 Dec 2022 4:02 AM GMTసీనియర్ నటుడు చలపతిరావు హఠాన్మరణాన్ని పరిశ్రమను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. ఆయన గుండె పోటుతో మృతి చెందారని తెలిసి అంతా షాక్ తిన్నారు. అయితే రెండు రోజుల క్రితం ఆయన ట్విట్టర్ లో చేసిన ఓ పోస్ట్ ఇప్పుడు ఆయన అభిమానులకు కన్నీళ్లు తెప్పిస్తోంది. చలపతిరావు కంటే రెండ్రోజుల ముందు మరో సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ మరణించిన సంగతి తెలిసిందే. చలపతిరావుకు ఆయనతో అనుబంధం ఎంతో గొప్పది. సత్తెన్నా అంటూ అభిమానంగా పిలుస్తారు. కానీ ఇప్పుడు చలపతిరావు కూడా ఊహించని విధంగా హఠాత్తుగా అంతర్థానమయ్యారు.
ఇంతకీ చలపతిరావు పోస్ట్ లో ఏం ఉంది? అంటే... "నువ్వు కూడా వెళ్లిపోయావా సత్తెన్నా?" అని చలపతిరావు రాసారు. ఆయన డిసెంబర్ 23న NT రామారావు - కైకాల సత్యనారాయణల ఓల్డ్ క్లాసిక్ ఫోటోని షేర్ చేసుకున్నారు. పాతకాలం బ్లాక్ అండ్ వైట్ ఫోటో ఇది.
పరిశ్రమ సహచరులు మరణించిన ప్రతిసారీ చలపతిరావు ఎంతో ఎమోషనల్ అయ్యేవారు. గతంలో సీనియర్ నటుడు కృష్ణంరాజు మరణించినప్పుడు ఆయన ఇలాంటి ఒక క్లాసిక్ మెమరీని పోస్ట్ చేసి "నువ్వు కూడా వెళ్లిపోయావా అన్నా" అని రాశాడు.
ఇప్పుడు గుండెపోటుతో చలపతిరావు హఠాన్మరణం తర్వాత ఇవన్నీ ఒకటొకటిగా చర్చకు వస్తున్నాయి. సహచర నటులు తన సన్నిహిత మిత్రుల మరణాన్ని ఆయన జీర్ణించుకోలేకపోయారని అర్థమవుతోంది. సాటి నటులతో అతడు ఎంతో సన్నిహితంగా ఉంటారు. అనుబంధం పెనవేసుకుని ఎమోషనల్ గా ఉంటారని సన్నిహితులు చెబుతున్నారు. అందుకే వరుస మరణాలు ఆయనను కలచివేసాయి. తోటి నటీనటులతో ఆయన సరదాగా ఉండేవారు. పరాచికాలు ఆడేవారు. అచ్చట్లు ముచ్చట్లతో నవ్వించే కలుపుగోలుతనం అతడిది. అందుకే ఆయనను ఎవరూ మరువలేరు.
అందుకే ఇప్పుడు కచ్చితంగా చలపతిరావు ట్వీట్లు చర్చనీయాంశం అవుతున్నాయి. ప్రతిసారీ తన తోటి కళాకారులను కోల్పోయినందుకు సంతాపం వ్యక్తం చేసారు. ఇప్పుడు తన సహచరులతో ఆయన కూడా స్వర్గానికేగారు. తన రాతలతో అభిమానులను కన్నీళ్లు పెట్టించాడు. ఏదేమైనా తన స్వర్గలోకంలో ఆయన విహరిస్తున్నారు. అక్కడ ఆయన సంతోషంగా ఉండాలని అభిమానులు స్మరిస్తున్నారు. చలపతిరావు 1944లో జన్మించారు. 800 పైగా చిత్రాల్లో నటించిన ఆయన విలన్ గా హాస్యనటుడిగా పాపులరయ్యారు. అలాగే అరడజను సినిమాలు కూడా నిర్మించారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.