Begin typing your search above and press return to search.

సీనియ‌ర్ న‌రేష్ 1000 కోట్ల వార‌సుడు!

By:  Tupaki Desk   |   23 May 2023 2:46 PM IST
సీనియ‌ర్ న‌రేష్ 1000 కోట్ల వార‌సుడు!
X
దివంగ‌త న‌టి.ద‌ర్శ‌కురాలు..నిర్మాత విజ‌య నిర్మ‌ల త‌న‌యుడిగా తెలుగు చ‌ల‌న చిత్ర ప‌రిశ్ర‌మ‌కు ప‌రిచ‌యమైన న‌రేష్ సినీ ప్ర‌స్థానం గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. ఎన్నో సినిమాల్లో న‌టించారు. న‌టుడిగా త‌న‌కంటూ ప్ర‌త్యేక‌మైన గుర్తింపును ద‌క్కించుకున్నారు. నేటిత‌రం న‌టుల‌తోనూ క‌లిసి ప‌నిచేస్తు న్నారు. న‌టుడిగా ఆయ‌న జీవితం ఎంతో సంతోషంగా సాగిపోతుంది.

అయితే వ్య‌క్తిగ‌త జీవితంలో కొన్ని ర‌కాల క‌ల‌త‌లు చోటు చేసుకున్న సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలో ప‌విత్రా లోకేష్ తో రిలేష‌న్ షిప్ వంటి వ్య‌వ‌హారం మీడియాలో హాట్ టాపిక్ అవ్వ‌డం..అదే అంశాన్ని ఆధారంగా చేసుకుని ఓ సినిమ చేయ‌డం వంటివి జ‌రిగాయి.

ఇక న‌రేష్ ఆస్తిపాస్తుల గురించి ప‌రిశ్ర‌మ‌లో ఎప్ప‌టిక‌ప్పుడు చ‌ర్చ న‌డుస్తుంది. ఆయణ‌ న‌టుడు కాక‌పోయినా! త‌ర‌త‌రాలు తినేంత ఆస్తుపాస్తులున్నాయ‌ని వాటి వార‌సుడు న‌రేష్ అని అంటుంటారు. విజ‌య నిర్మాల కుమారుడి కోసం ఎన్నో ఆస్తులు సంపాదించి పెట్టిన‌ట్లు చెబుతారు.

అలాగే న‌రేష్ న‌టుడైనా త‌ర్వాత బాగానే సంపాదించాడు. మొత్తంగా న‌రేష్ 1000 కోట్ల వార‌సుడిగా పేరుంది. న‌టుడిగా ఆయ‌న ఎప్పుడూ బిజీగానే ఉంటారు. చిన్న సినిమా..పెద్ద సినిమా అనే తేడా లేకుండా అవ‌కాశం వ‌చ్చి పాత్ర న‌చ్చితే ఆ సినిమాలో న‌టిస్తుంటారు.

అయితే న‌రేష్ ఆస్తుల గురించి ఇంత‌వ‌ర‌కూ ఆయ‌న ఏనాడు ఓపెన్ అయింది లేదు. ఆనోటా..ఈనోటా జ‌రిగే ప్ర‌చారం త‌ప్ప అందులో వాస్త‌వం ఏంటి? అన్న‌ది తెలియ‌దు. ఈ నేప‌థ్యంలో తాజాగా న‌రేష్ ఆస్తుల గురించి రివీల్ చేసారు. 'అవును నేను రిచ్ అన‌డంలో ఎలాంటి సందేహం లేదు. నేను బిలియ‌నీర్ అని ఒప్పుకుంటా. మా అమ్మ గారి నుంచి నాకు ఆస్తులు వ‌చ్చాయి. నేను కూడా క‌ష్ట‌ప‌డి బాగానే సంపాదించా. భూముల మీద పెట్టుబ‌డులు పెట్టాం. వాటి ధ‌ర‌లు బాగా పెరిగాయి ఇప్పుడు.

వెయి కోట్ల‌కు పైగానే ఉంటుంద‌ని అంచ‌నా. అయితే డ‌బ్బుని బ‌ట్టి ధ‌న‌వంతులు అన‌డం త‌ప్పు. రోజు ఎంత ఆనందంగా గ‌డుపుతున్నాం. ఉన్న డ‌బ్బుని ఎలా ఖ‌ర్చు పెడ‌తాం. మా కోస‌మే కాక ఇత‌ర కోసం కూడా ఖర్చు చేయాలి. స‌హాయం కావాల్సిన వాళ్ల‌కు ఆ ర‌కంగా ఉప‌యోగ ప‌డాలి. మాకు వీలైనంత వ‌ర‌కూ సాయం చేస్తాం. నేను చాలా సంతోషంగా జీవితాన్ని గ‌డుపుతున్నా. ఆస్వాదిస్తున్నా' అని అన్నారు.