Begin typing your search above and press return to search.
యువరక్తమా? కష్టసుఖాలు తెలిసినవాడా? ఎవరు `మా` అధ్యక్షుడు కావాలి?
By: Tupaki Desk | 23 Jun 2021 3:39 AM GMTఇది ఆసక్తికరమైన ప్రశ్న.. మూవీ ఆర్టిస్టుల సంఘం (మా) అధ్యక్షుడిగా యువరక్తం కావాలా? కష్టసుఖాలు తెలిసిన సీనియర్ నటుడు కావాలా? ఈ ప్రశ్నకు సమాధానం సెప్టెంబర్ లో జరగనున్న మా ఎన్నికల్లో మెంబర్లు నిర్ణయిస్తారు.
అధ్యక్ష పదవికి పోటీపడుతున్న ప్రకాష్ రాజ్.. మంచు విష్ణు లో ఎవరు కావాలి? అన్నది `మా` సంఘం 800 మంది సభ్యులు ఓట్ల రూపంలో నిర్ణయించాల్సి ఉంటుంది. ఇంతకీ ప్రస్తుత అధ్యక్షుడు సీనియర్ నరేష్ వెర్షన్ ఎలా ఉంది? అంటే.. ఆ ఇద్దరి నడుమా సాదరంగా పోటీని స్వాగతిస్తున్నానని ఆయన వ్యాఖ్యానించారు.
మంచు విష్ణు యువరక్తం. పరిశ్రమలో పెరిగిన బిడ్డ. సమస్యలు తెలిసినవాడు. ఆర్టిస్టుల కష్టం తెలిసిన ఫ్యామిలీ నుంచి వచ్చినవాడు.. జయాపజయాలతో సంబంధం లేకుండా మోహన్ బాబు గారి ఫ్యామిలీ 50 సినిమాలు తీసి అందరికీ అన్నం పెట్టారు. ఇలాంటి కుటుంబం నుంచి యువరక్తం వస్తే మార్పు వస్తుందని నా ఆశ...! ప్రకాష్ రాజ్ విషయానికి వస్తే అతడు నాకు మంచి స్నేహితుడు. కష్టసుఖాలు తెలిసినవాడు. సహాయగుణం కలిగిన వ్యక్తి. అతను మా అధ్యక్షుడిగా పోటీ చేసినా స్వాగతిస్తానని అన్నారు. పరిశ్రమ యువరక్తమా? కష్టసుఖాలు తెలిసినవాడా? ఎవరు `మా` అధ్యక్షుడు కావాలి? అన్నది సభ్యులే నిర్ణయించాల్సి ఉంది.