Begin typing your search above and press return to search.
MAA వార్.. మహిళకే అధ్యక్ష పదవి ఛాన్సుందా?
By: Tupaki Desk | 26 Jun 2021 4:30 PM GMTమూవీ ఆర్టిస్టుల సంఘం (మా) ఎన్నికల వార్ పతాక స్థాయికి చేరుకుంటోంది. ప్రకాష్ రాజ్ వర్గం .. మంచు విష్ణు- నరేష్ వర్గం ఎవరికి వారు తమ ప్రతిపాదనలను బహిర్గతం చేస్తున్నారు. అయితే ఇంతలోనే జీవిత రాజశేఖర్.. హేమ పేర్లు అధ్యక్ష రేసులోకి రావడం ఆసక్తిని కలిగించింది. ఇంతకీ ఛతుర్ముఖ పోటీలో అధ్యక్షులు అయ్యేదెవరు? అన్నది ఆసక్తిగా మారింది.
ఆ క్రమంలోనే `మా అసోసియేషన్ ప్రస్తుత అధ్యక్షుడు వీకే నరేశ్ తెరపైకి సరికొత్త ప్రతిపాదన తెచ్చారు. నేటి నుంచి తన పదవికి విరమిస్తున్నానని మీడియా ముఖంగా ప్రకటించిన నరేష్.. సెప్టెంబర్ లో ఎన్నికల కోసం వేచి చూడాలని అన్నారు.
అలాగే ఈసారి `మా`అధ్యక్ష పదవిని మహిళకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. మహిళ ఏకగ్రీవానికి ప్రయత్నించాలని అన్నారు. అలాగే ఈ ఎన్నికల్లో లింగ వివక్షకు కులమతాలకు లోకల్ నాన్ లోకల్ అనే అంశాలకు మా ఎన్నికల్లో తావు లేదని నరేష్ అన్నారు. ఇప్పటివరకూ అందరు అధ్యక్షులు బాగా పని చేశారు. ఇకపైనా మంచిగా పనులు చేసే అధ్యక్షురాలు కావాలని అన్నారు.