Begin typing your search above and press return to search.

అంకుల్ అని పిలిస్తే కేసు పెడతాడనన్న సీనియర్ నటుడు..!

By:  Tupaki Desk   |   31 Aug 2022 3:49 AM GMT
అంకుల్ అని పిలిస్తే కేసు పెడతాడనన్న సీనియర్ నటుడు..!
X
ప్రముఖ నటుడు బ్రహ్మాజీ ఆన్ స్క్రీన్ లో ఎంత వైవిధ్యంగా నటిస్తాడో.. ఆఫ్ స్క్రీన్ లో అంతే ఫన్నీగా వ్యవహరిస్తుంటారనే సంగతి తెలిసిందే. సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండే బ్రహ్మాజీ.. వ్యక్తిగత సినిమాల విశేషాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. ఎప్పటికప్పుడు తనదైన చమత్కారమైన ట్వీట్స్ - సెటైర్లతో నెటిజన్లను ఆకట్టుకుంటాడు.

ఏజ్ అనేది జస్ట్ నంబర్ మాత్రమే అని ఇండస్ట్రీలో నాగార్జున - మహేష్ బాబు లాంటి హీరోలను ఉద్దేశించి సినీ అభిమానులు కామెంట్స్ చేస్తుంటారు. బ్రహ్మాజీ కూడా ఇదే కోవలోకి వస్తారు. ఎప్పటికీ యంగ్ గా కనిపించడమే కాకుండా.. తన పెర్ఫార్మెన్స్ తో ఆడియన్స్ ను అలరిస్తుంటారు.

తన వయస్సు కంటే చాలా యంగ్ గా కనిపిస్తున్నందుకు బ్రహ్మాజీ తనపై తానే కొన్ని ఫన్నీ కామెంట్లు వేయడానికి వెనుకాడడు. తరచూ యాంకర్ సుమ మరియు ఇతర స్టార్ హీరోలతో కలిసి స్టేజీల మీద నవ్వులు పూయిస్తుంటారు. అయితే తనని 'అంకుల్' అని పిలిస్తే కేసు వేస్తానని అంటున్నారు బ్రహ్మాజీ.

మంగళవారం సాయంత్రం తన సెల్ఫీ ఫోటోని పోస్ట్ చేస్తూ 'వాట్స్ హ్యాపెనింగ్' (ఏం జరుగుతోంది?) అని క్యాప్షన్ పెట్టారు బ్రహ్మాజీ. అది చూసిన ఓ నెటీజన్ 'ఏం లేదు అంకుల్' అని బదులిచ్చాడు. ఆ రిప్లై చూసిన బ్రహ్మాజీ దాన్ని రీ ట్వీట్ చేస్తూ.. 'అంకులేంట్రా అంకుల్.. కేసు వేస్తా.. ఏజ్ - బాడీ షేమింగ్ చేస్తున్నావా?' అంటూ నవ్వుతున్న ఎమోజీని జతచేశారు. ఈ ట్వీట్ క్షణాల్లో వైరల్ అయింది.

అభిమానులు బ్రహ్మాజీ ట్వీట్ కు సరదా కామెంట్స్ పెడుతూ ట్విట్టర్ ను హోరెత్తించారు. వాట్ ఏ టైమింగ్ అంటూ ఫన్నీ మీమ్స్ తో సందడి చేశారు. ఆన్ లైన్ ట్రోల్స్ గురించి ఇటీవల జరిగిన వివాదాన్ని వ్యగ్యంగా విశ్లేషించడానికి బ్రహ్మాజీ ఈ అవకాశాన్ని ఉపయోగించుకున్నాడని నెటిజన్లు అభిప్రాయ పడుతున్నారు.

బ్రహ్మాజీ గతంలోనూ ఫన్నీ ట్వీట్స్ తో సందడి చేశారు. ఇప్పుడు తనని 'అంకుల్' అని పిలిస్తే కేసు వేస్తానంటూ సెటైరికల్ ట్వీట్ తో మరోసారి అందరినీ నవ్వించాడు. ఈ సరదా ట్వీట్ కు కొన్ని హ్యాష్ ట్యాగ్స్ కూడా జోడించడం మర్చిపోయారు అంకుల్ అని నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.