Begin typing your search above and press return to search.
డబ్బుంటేనే ఎవరైనా గౌరవిస్తారు: సీనియర్ నటి
By: Tupaki Desk | 24 May 2022 12:30 AM GMTముచ్చర్ల అరుణ పేరు వినగానే 'మాటే మంత్రమూ .. మనసే బంధమూ' అనే పాట గుర్తుకు వస్తుంది. ఆమె కథానాయికగా నటించిన 'సీతాకోకచిలుక' సినిమా అంతగా ప్రభావితం చేసింది. ముచ్చర్ల అరుణ కేరక్టర్ ఆర్టిస్టుగా చాలా సినిమాలు చేశారు. ఆమె ఏ పాత్రను పోషించినా తెరపై ఆ పాత్ర మాత్రమే కనిపించేలా చేయడం ఆమె ప్రత్యేకత. కేరక్టర్ ఆర్టిస్టుగా మంచి పేరు తెచ్చుకున్న ఆమె, వివాహమైన తరువాత నటనకి దూరంగా ఉన్నారు.
ముచ్చర్ల అరుణకు నలుగురు కూతుళ్లు .. ఆమె భర్త పెద్ద బిజినెస్ మేన్. ముచ్చర్ల అరుణ ఇప్పుడు ఎంతో శ్రీమంతురాలు. అలాంటి ఆమె తాజా ఇంటర్వ్యూలో తన మనసులోని మాటలను ఇలా చెప్పుకొచ్చారు. " జీవితంలో చాలామంది తామేంటి? అనే విషయాన్ని పక్కన పెట్టేసి, ఎవరేం అనుకుంటున్నారో అని ఆలోచిస్తూ అవతల వాళ్ల కోసం బ్రతికేస్తుంటారు .. అదే నాకు నచ్చదు. మా ఇంట్లో మొత్తం ఆరుకార్లు ఉన్నాయి .. ఎవరి డ్రైవర్ వారికి ఉంటాడు. కానీ నాకు డ్రైవర్ వద్దనే నేను చెప్పాను .. ఎక్కడికి వెళ్లినా నేనే డ్రైవ్ చేసుకుంటూ వెళతాను.
ఎంత ఖరీదైన కార్లో వెళ్లాలా అని ఆలోచన చేయను .. ఎంత కంఫర్ట్ గా వెళుతున్నానా అని మాత్రమే ఆలోచన చేస్తాను. నేను ఇంత ఖరీదైన కార్లో వచ్చాను .. నా రేంజ్ ఇది అని చూపించుకోవడానికి వెళ్లడం నాకు నచ్చదు. అందరూ నా వైభవాన్ని చూస్తున్నారా లేదా? అనే గొప్పలకు పోవడం నాకు అస్సలు ఇష్టం ఉండదు.
ఎవరు ఏమనుకున్నా ఫరవాలేదు .. ఇది నేను .. ఇలాగే ఉంటాను. మా పిల్లలు 'అమ్మా ఇప్పుడు ఇలాగే ఉండాలి .. నీకు అర్థం కావడం లేదు ' అంటారు. అవతలివాళ్లు నన్ను అర్థం చేసుకోవాలంతే అని నేను అంటాను.
నన్ను నేను ప్రూవ్ చేసుకోలేదు .. రిక్షాలో వస్తే అంగీకరించరు. అలా వచ్చినప్పుడు ఇచ్చే మర్యాద వేరేగా ఉంటుంది. ఒక స్టేటస్ వచ్చిన తరువాత ఎవరైనా అలా వస్తే అప్పుడు వాళ్లను గురించి మరింత గొప్పగా చెప్పుకుంటాం.
కానీ గొప్పవారైనా సింపుల్ గా ఏ సైకిల్ పైనో .. రిక్షా పైనో వస్తే ఎవరూ పట్టించుకోరు. డబ్బుంటేనే .. ఆడంబరంగా కనిపిస్తేనే ఎవరైనా గౌరవిస్తారు .. లోక తీరు అది. ఆడంబరాలకు పోనివారిని గౌరవిస్తే అలాంటివారు నిజంగా గొప్పవారే. అలాంటివారికి నేను హ్యాట్సాఫ్ చెబుతాను" అంటూ చెప్పుకొచ్చారు.