Begin typing your search above and press return to search.

గుండెపోటు కాదు.. నేను బాగానే ఉన్నాను - సీనియర్ నటి

By:  Tupaki Desk   |   1 Feb 2021 5:30 AM GMT
గుండెపోటు కాదు.. నేను బాగానే ఉన్నాను - సీనియర్ నటి
X
సీనియర్ నటి ఆమని గుండెపోటుతో ఆసుపత్రిలో చేరారని ఆదివారం మధ్యాహ్నం నుంచి సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ అయ్యింది. ఈ న్యూస్ తెలిసిన ఆమె అభిమానులు, సన్నిహితులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. అందరూ ఆమని హెల్త్ కండిషన్ గురించి తెలుసుకునేందుకు ప్రయత్నించారు.

అయితే.. ఆమని స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. సంపూర్ణేష్‌బాబు హీరోగా నటిస్తున్న సినిమాలో ఆమె ఓ కీలక పాత్రలో నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్‌లో పాల్గొన్న ఆమె.. అస్వస్థతకు గురయ్యారు. దీంతో వెంటనే ఆమెను స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు.

అయితే.. తనకు గుండె పోటు అని జరుగుతున్న ప్రచారంపై ఆమని స్పందించారు. తాను స్వల్ప అస్వస్థతకు గురయ్యానని, హార్ట్ ఎటాక్ వార్తలు అవాస్తవమని ఆమె ఒక ప్రకటన విడుదల చేశారు. ఫుడ్ పాయిజనింగ్ కారణంగా అనారోగ్యానికి గురైనట్టు చెప్పారు. ప్రస్తుతం ఆరోగ్యం నిలకడగా ఉందని, ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయినట్లు సమాచారం.

కాగా.. ఆమె లీడ్ రోల్‌లో నటించిన `అమ్మదీవెన` సినిమా నేడు(శుక్రవారం) విడుదల కానుంది. అంతేకాకుండా.. ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’, ‘చావు కబురు చల్లగా’ చిత్రాలతోపాటు మరికొన్ని సినిమాల్లోనూ ఆమని నటిస్తున్నారు.