Begin typing your search above and press return to search.
కాస్టింగ్ కౌచ్ పై సీనియర్ నటి అన్నపూర్ణ కీలక వ్యాఖ్యలు
By: Tupaki Desk | 9 April 2021 10:31 AM GMTసినిమా ఇండస్ట్రీకి చెందిన వారు ఒప్పుకున్నా ఒప్పుకోకున్నా కూడా కాస్టింగ్ కౌచ్ అనేది ఇక్కడ ఎక్కువగా ఉంది. సినిమా పరిశ్రమలో కొత్తగా అమ్మాయిలు పరిచయం అయ్యేందుకు ప్రయత్నిస్తే ఖచ్చితంగా కమిట్ మెంట్ లు అడుగుతున్నారు. ఇటీవల కాలంలో కాస్త ఈ కాస్టింగ్ కౌచ్ తగ్గినా కూడా ఆఫర్ల ఎర చూపి కొందరు లొంగ తీసుకోవడం మాత్రం తగ్గలేదు. సినిమా మోజుతో అమాయకపు అమ్మాయిలు ఇంకా కూడా జీవితాలను నాశనం చేసుకుంటున్నారు అనేది ఇండస్ట్రీలో ప్రతి ఒప్పుకుంటున్న బహిరంగ రహస్యం.
తాజాగా సీనియర్ నటి అన్నపూర్ణ కాస్టింగ్ కౌచ్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆమె మాట్లాడుతూ.. కాస్టింగ్ కౌచ్ అనేది ప్రతి ఒక్క ఇండస్ట్రీలో ఉంటుంది. కాని కుటుంబ గౌరవ మర్యాదలను దృష్టిలో పెట్టుకుని వీటికి లొంగరు. కాని కొందరు ఇండస్ట్రీ వర్గాల వారు మాత్రం ఆఫర్ల ఆశ చూపించి లొంగదీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ విషయంలో తప్పు అనేది ఒక్క వైపు ఉండదు.
ఇద్దరికి ఇష్టం అయితేనే తప్పు జరుగుతుందని ఆమె అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇతర రంగాల వారు ఎలా అయితే ఈ కాస్టింగ్ కౌచ్ నుండి తప్పించుకుంటున్నారో సినిమా రంగానికి చెందిన వారు కూడా దీని నుండి తప్పించుకోవాలని.. ఇలాంటివి ఎదురైతే వెంటనే బయటకు చెప్పాలి. అలా చెప్పినప్పుడు మాత్రమే ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ అనేది లేకుండా పోతుందని అభిప్రాయం వ్యక్తం చేసింది.