Begin typing your search above and press return to search.
తెలుగులో నటించనంటున్న సీనియర్ నటి
By: Tupaki Desk | 31 Jan 2016 7:30 PM GMTనిరీక్షణ - లేడీస్ టైలర్ లాంటి సినిమాలు తలుచుకుంటే ఆటోమేటిగ్గా అర్చన గుర్తుకొచ్చేస్తుంది. తన అందం, అభినయంతో 80ల్లో ప్రేక్షకులపై బలమైన ముద్ర వేసింది ఈ నల్ల బంగారం. ఐతే హీరోయిన్ గా తన పనైపోయిందని అనిపించగానే ఆమె సినిమాల నుంచి తప్పుకుంది. మళ్లీ సినిమాల వైపు చూడలేదు. ఐతే దాదాపు రెండు దశాబ్దాల మధ్య అర్చన మళ్లీ ఇప్పుడు ఓ తమిళ సినిమాతో రీఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతోంది అర్చన.
ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో ఆ సినిమా విశేషాల గురించి మాట్లాడుతుండగా మళ్లీ తెలుగులో నటిస్తారా అని అడిగితే.. లేదని ఖరాఖండిగా చెప్పేసింది అర్చన. కారణమేంటి అని అడగ్గా.. గతంలో తెలుగులో నటించేటపుడు తనకు ఓ చేదు అనుభవం ఎదురైందని.. అందుకే ఇక ఎప్పటికీ అక్కడ నటించకూడదని నిర్ణయించుకున్నానని చెప్పింది అర్చన. మరి ఆ చేదు అనుభవం ఏంటో చెప్పడానికి మాత్రం ఆమె ఇష్టపడలేదు. ఐతే ఎప్పుడో జరిగిందానికి ఫీలై ఇప్పటికీ తెలుగులో నటించకూడదని నిర్ణయించుకోవడం ఆశ్చర్యం కలిగించే విషయమే.
తమిళంలో అర్చన రీఎంట్రీ ఇస్తున్న సినిమా పేరు ‘అళియాద కోలంగళ్. ఇదే పేరుతో ఒకప్పుడు లెజెండరీ డైరెక్టర్ బాలు మహేంద్ర ఓ సినిమా తీయడం.. అందులో అర్చన హీరోయిన్ గా నటించడం విశేషం. బాలు మహేంద్ర శిష్యులందరూ కలిసి తీస్తున్న ఈ లేటెస్ట్ మూవీలో ప్రకాశ్‌రాజ్, రేవతి లాంటి ప్రముఖ నటీనటులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఎస్.భారతి దర్శకత్వం వహిస్తున్నాడు.