Begin typing your search above and press return to search.
నమ్మక ద్రోహంతో నన్ను రోడ్డున పడేశారు: సీనియర్ నటి
By: Tupaki Desk | 17 May 2022 11:30 PM GMTచిత్రపరిశ్రమలో ఎప్పటికప్పుడు పోటీని తట్టుకుని నిలబడుతూ .. తమ ప్రతిభా పాటవాలతో అగ్రస్థానానికి చేరుకున్నవాళ్లు ఎంతోమంది ఉన్నారు. వాళ్లలో చాలామంది ఎంతో కష్టపడి సంపాదించుకున్న డబ్బును పోగొట్టుకున్నారు. కొంతమంది ఆర్టిస్టులు ఇతరుల చేతిలో మోసపోతే .. మరికొందరు సొంతవారి చేతిలోనే మోసపోయారు. అలా మోసపోయినవారి జాబితాలో 'షావుకారు' జానకి కూడా కనిపిస్తారు. 1950లలో సినిమాల్లోకి వచ్చిన 'షావుకారు' జానకి, వివిధ భాషల్లో తిరుగులేని కథానాయిక అనిపించుకున్నారు.
అప్పట్లో మద్రాసులోని సంపన్న కుటుంబాల జాబితాలో షావుకారు జానకి పేరు కూడా వినిపిస్తూ ఉండేది. ఖరీదైన బంగళాలు .. కార్లు .. తోటలు .. పొలాలు .. ఇవన్నీ కూడా ఆమె పేరుతో ఉండేవి.
ఒకానొక సమయంలో అవన్నీ కూడా పోగొట్టుకుని రోడ్డు మీదకి వచ్చేశాననీ .. కొంతమందిని నమ్మడం వలన ఆ పరిస్థితి వచ్చిందని తాజా ఇంటర్వ్యూలో ఆమె చెప్పారు. ఆమె మాట్లాడుతూ .. "సినిమా వేరు .. జీవితం వేరు. జీవితంలో డబ్బు విషయంలో .. ఆస్తుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. వేరొకరికి పెత్తనం ఇస్తున్నప్పుడు మరింత జ్రాగ్రత్తగా ఉండాలి.
ఈ రోజు వరకూ నేను ఎవరికీ .. ఎక్కడా చెప్పలేదు. కొంతమందిని నమ్మడం వలన నాకు ఉన్నదంతా పోగొట్టుకున్నాను. ఒకానొక సమయంలో రోడ్డు మీదికి వచ్చేశాను. ఎంతో విలువైన ఆస్తులు పోగొట్టుకున్నాను.
12 ఎకరాల విలువైన భూమిని పోగొట్టుకున్నప్పుడు కూడా నేను ఎక్కడా చెప్పలేదు. ఇలా జరగడాన్ని విధి అనుకోలేను .. నమ్మక ద్రోహమనే అనుకుంటాను. మనవాళ్లే కదా అని పెత్తనం ఇవ్వడం వలన అలా జరిగింది. అంతా పోయినప్పుడు కూడా నేను బాధపడలేదు కాళ్లు చేతులు బాగుంటే సంపాదించుకోవచ్చు అనే అనుకున్నాను.
కొంతమందిలో ఈర్ష్య .. అసూయ .. జెలసీ ఎలా ఉంటాయనేది నేను చూశాను. ఇంకా నా దగ్గర ఏదో ఉందనే అనుకుంటున్నారు. నేను ఎవరికి ఏమేం ఇస్తానని చెప్పానో అవి ఇచ్చేశాను. మనసుంటే చాలు అని చాలామంది అంటూ ఉంటారు. కానీ మనసుంటే చాలదు .. జీవితంలో డబ్బు కూడా ఉండాలనేది అనుభవంతో తెలుస్తుంది. నా కాపురాన్ని కాపాడతారని అనుకున్నవారే పాడుచేయడం ఎంతో బాధను కలిగించింది. జీవితంలో ఎవరినో ఒకరిని నమ్మవలసిన పరిస్థితి వస్తుంది. అలా నమ్మినప్పుడు ఇలా కూడా జరుగతుంది" అంటూ చెప్పుకొచ్చారు.