Begin typing your search above and press return to search.

జయసుధపై నిర్మాత నోరు జారాడా?

By:  Tupaki Desk   |   29 Nov 2016 10:30 PM GMT
జయసుధపై నిర్మాత నోరు జారాడా?
X
సీనియర్ నటి జయసుధ ఆన్ స్క్రీన్ పైనే కాదు.. ఆఫ్ స్క్రీన్ లోనూ చాలా సాఫ్ట్ అనే టాక్ ఉంది. వేరే విషయాలేవీ పట్టించుకోకుండా తన పని తాను చేసుకుపోతుందని.. సహజనటి కావడంతో ఆమెతో వర్క్ చేయడం చాలా ఈజీ అని భావిస్తారు దర్శక నిర్మాతలు. కానీ ఇప్పుడు దర్శకుడు కం నిర్మాతతో మాటామాటా వచ్చి.. సెట్స్ నుంచి జయసుధ వాకౌట్ చేసిందనే న్యూస్.. హాట్ టాపిక్ గా మారింది.

బిచ్చగాడు లాంటి మూవీని అందించిన చదలవాడ శ్రీనివాసరావు.. తనే నిర్మాత-దర్శకుడిగా హెడ్ కానిస్టేబుల్ వెంకట్రామయ్య అనే చిత్రాన్ని ప్రారంభించాడు. ఆర్ నారాయణమూర్తి లీడ్ రోల్ లో నటిస్తుండగా.. ఆయనకు జోడీగా జయసుధను తీసుకోవడం సెన్సేషన్ అయింది. ఈ మూవీ షూటింగ్ కు తరచుగా జయసుధ ఆలస్యంగా వస్తోందట. దీంతో సెట్స్ కు సరైన సమయానికి రావాల్సిందిగా చెప్పాడట దర్శకుడు. ఈ విషయంలో చదలవాడతో జయసుధ కు వాగ్వాదం జరిగిందని.. చివరకు సెట్స్ నుంచి ఆగ్రహంగా జయసుధ వెళ్లిపోయిందని చెప్పుకుంటున్నారు.

సీనియర్ నటిపై ఇలాంటి మాట రావడంతో ఇండస్ట్రీ జనాలు కూడా దీనిపై ఆశ్చర్యపోయారు. మరోవైపు.. లీడ్ రోల్ చేస్తున్న జయసుధ వెళ్లిపోవడంతో.. హెడ్ కానిస్టేబుల్ వెంకట్రామయ్య షూటింగ్ దాదాపు ఆగిపోయినట్లు తెలుస్తోంది. నారాయణమూర్తి-జయసుధలతో రేర్ కాంబో సెట్ చేయగలిగిన ఈ దర్శకుడు.. అంత సాఫీగా సినిమాను షూట్ చేయలేకపోతుండడం ఆశ్చర్యకరమే.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/