Begin typing your search above and press return to search.
ఈవిడ నయన్ ను పొగిడిందా తిట్టిందా?
By: Tupaki Desk | 27 Nov 2017 4:22 PM GMTసినీతారలకు ఈ రోజుల్లో పొగడ్తలు అందడం చాలా కామన్. అలాగే విమర్శలు కూడా చాలానే వస్తుంటాయి. వాటిని చాలా వరకు తారలు దూరం పెడతారు. ఇక పొగిడేవారి విషయానికి వస్తే.. వారి మీద ప్రేమను చూపించబోయి ఒక్కోసారి అతి ప్రేమను చూపించి నవ్వుల పాలవుతుంటారు. ఇక కొంచెం ఈర్ష్య ఉంటే వారు కూర్చున్న కొమ్మనే నరికేల డైలాగులతో కాంట్రావర్సీ చేస్తుంటారు. సినీ తెరపై చూపించే మ్యాజిక్ లైవ్ లొనే చూపించడానికి ట్రై చేస్తుంటారు.
ఇక అసలు విషయానికి వస్తే.. రీసెంట్ గా ఒక నటి పొగిడిందో తిట్టిందో అనే విషయం అర్థం కాకుండా ఒక నటి గురించి చాల మాట్లాడేసింది. ఆమె ఎవరో కాదు ప్రముఖ నటి లక్ష్మి రామకృష్ణన్. రీసెంట్ గా ఈ సీనియర్ నటి హీరోయిన్ నయనతార పై కొన్ని కామెంట్స్ చేసింది. ఇటీవల రిలీజ్ అయిన అరామ్ సినిమా నయనకి మంచి గుర్తింపును ఇచ్చింది. సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చడంతో అమ్మడి రేంజ్ కూడా చాలా వరకు పెరిగిపోయింది. నయన ఇన్నేళ్ల కెరీర్ లో ఎప్పుడు అందుకొని ప్రశంసలను అందుకుంది. ఫైనల్ గా అందరు లేడి సూపర్ స్టార్ అని కూడా అనేస్తున్నారు. లక్ష్మీ రామకృష్ణన్ కూడా నయన - అరామ్ సినిమాపై స్పందించింది.. ఆమె మాట్లాడుతూ.. సినిమా చాలా బావుంది. ముఖ్యంగా సినిమాటోగ్రఫీ మ్యూజిక్ సినిమా స్థాయిని పెంచాయి. ఆ వర్క్ చాలా బావుంది. నయనతార కూడా చాలా అందంగా కనిపించింది. నటన కూడా హైలెట్. అయితే సినిమాలో నాకు రెండు విషయాలు అస్సలు నచ్చలేదు. ముఖ్యంగా చిన్నారి బోరు బావిలో పడిపోయినప్పుడు తన అన్న( హీరో) రక్షించిన తర్వాత ప్రాథమిక చిక్కిత్స చేయకుండా కలెక్టర్ కాళ్లపై పడతాడు. అంత అవసరం లేదు. మన తల్లి తండ్రులకు తప్ప మనం ఎవరి కాళ్లపై పడనవసరం లేదు.. అనేసింది.
ఇక మరొక విషయం ఏమిటంటే.. దయచేసి నయనతారను సూపర్ స్టార్ అని అనకండి. ఆమెకు ఆ బిరుదు ఇస్తే.. ఆ దారిలోనే నడవాల్సి ఉంటుంది. ఇక అన్ని తరహా పాత్రలను చేయడానికి ఛాన్స్ ఉండదు. ఆమె నుంచి ఇంకా చాలా సినిమాలను కోరుకుంటున్నాం అని లక్ష్మి రామకృష్ణన్ చెప్పారు. దీంతో నయనతారను ఈమె పొగిడిందా లేక తిట్టిందా అని నెటీజన్స్ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.